Sunday, April 28, 2024
- Advertisement -

టార్గెట్ ఏపీ.. కేజ్రీవాల్ ప్లాన్ అదే !

- Advertisement -

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరువాత తరచూ వార్తల్లో నిలిచే పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ అనే చెప్పాలి. మొదట డిల్లీ వరకే పరిమితం అయిన అప్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరిస్తూ చపాకింద నీరులా పరిధిని పెంచుకుంటోంది. ఇప్పటికే పంజాబ్ అధికారం చేపట్టి మద్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. ఇక ఈ మద్య జరిగిన గుజరాత్, యూపీ ఎన్నికల్లో కూడా మంచి ఓటు బ్యాంకు ను రాబట్టి జాతీయ పార్టీగా గుర్తింపు దక్కించుకుంది. ఇదే జోష్ లో ఆమ్ ఆద్మీ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. ముఖ్యంగా కేజ్రీవాల్ చూపు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లపై పడినట్లు నేషనల్ మీడియా నుంచి వినిపిస్తున్న మాట. .

ముఖ్యంగా ఏపీలో పాగా వేయాలని కేజ్రీవాల్ ఉవ్విళ్లూరుతున్నారట. వచ్చే ఎన్నికల్లో అన్నీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కేజ్రీవాల్ ఇటీవల వ్యాఖ్యానించడంతో ఈ చర్చ మొదలైంది. ఇక ఇప్పటికే ఏపీలో పాగా వేయాలని బి‌ఆర్‌ఎస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ఆప్ కూడా ఏపీ లోకి ఎంట్రీ ఇస్తే.. ఏపీ రాజకీయ సమరం మరింత వేడెక్కడం ఖాయం. అయితే ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన వంటి పార్టీలు తిరుగులేని శక్తిగా ఉన్నాయి.

మూడు పార్టీలు కూడా స్థిరమైన ఓటు బ్యాంక్ తో నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. దాంతో ప్రజలు కూడా ఈ మూడు పార్టీలనే ప్రధాన పార్టీలుగా భావిస్తున్నారు. ఎప్పటికే ఏపీలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు నామమాత్రంగానే ఉన్నాయి తప్పా.. పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. ఇక బి‌ఆర్‌ఎస్, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు ఏపిలో పెద్దగా ఎలాంటి రాజకీయ సమీకరణలు మారవని కొందరి అభిప్రాయం. అయితే ఆమ్ ఆద్మీ పార్టీని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎవరు ఊహించని విధంగా విస్తరిస్తూ జాతీయ పార్టీలకు సైతం షాక్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో అప్ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఆశ్చర్యం లేదనే చెప్పాలి. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎంట్రీ ఇస్తుందా ? ఒకవేళ ఎంట్రీ ఇస్తే అప్ ప్రభావం ఎంతమేర ఉండబోతుందనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

ఎవరు మీలో సి‌ఎం ?

వాలెంటీర్ల వ్యవస్థ.. రాజ్యాంగానికి వ్యతిరేకమా ?

కే‌సి‌ఆర్ మాస్టర్ ప్లాన్.. సిద్దమైన బీజేపీ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -