- Advertisement -

లోకేష్ ,చంద్రబాబు లపై సంచలన కామెంట్స్ చేసిన కొడాలి నాని..

- Advertisement -
kodali nani fire lokesh

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు మంత్రి అయిన లోకేష్‌పై పై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు. గుంటూరులో జ‌రిగిన జ‌గ‌న్ రైతు దీక్ష‌లో పాల్గొన్న కొడాలి నాని… చంద్ర‌బాబుది దున్నపోతు ప్ర‌భుత్వ‌మ‌న్నారు. దున్నపోతు ప్ర‌భుత్వాన్ని నిద్ర‌లేపేందుకే జ‌గ‌న్ దీక్ష చేశార‌ని చెప్పారు. దొంగ వాగ్దానాల‌తో అధికారంలోకి వ‌చ్చిన దొంగ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిచి రైతుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఐదు వేల కోట్ల‌తో ధ‌ర‌ల స్థిరీక‌ర‌న నిధిని ఏర్పాటు చేస్తాన‌ని చెప్పిన బాబు అధికారంలోకి వ‌స్తానే మ‌ర‌చిపోయార‌న్నారు.మ‌ల్లీ అధికారంలోకి రాలేమ‌ని అందిన కాడికి దోచుకుని సింగ‌రూర్,జ‌పాన్‌తో స‌హ అమెరికాలాంటి దేశాల్లో దాచుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డం ఖాయమ‌ని …దాచుకున్న సొమ్మును న‌యాపైసాతో స‌హా క‌క్కిస్తామ‌న్నారు.బాబు వేసె బిస్కెట్ల‌కోసం క‌క్కుర్తిప‌డి త‌మ అధినేత‌ను,పార్టీనాయ‌కుల‌ను సోయ మ‌ర‌చి సిగ్గులేకుండా టార్గెట్ చేసిమాట్లాడుతున్నార‌ని …అలాంటి చెంచాగాల్ల‌ని ప‌ట్టించుకోమ‌న్నారు.జ‌గ‌న్‌ను విమ‌ర్శించే ముందు బాబు త‌న గ‌తాన్ని త‌లుచుకోవాల‌ని…పిల్ల‌నిచ్చిన మామ‌కు వెన్న‌పోటు పొడిచిన చ‌రిత్ర బాబుద‌ని మండిప‌డ్డారు.

టీడీపీని నందమూరి కుటుంబానికి ఇచ్చేసి, చంద్రబాబు నాయుడు సొంతంగా పార్టీ పెడితే డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేశారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియని వ్యక్తిని తీసుకు వచ్చి మంత్రిని చేశారని, ఆ మంత్రి నీటి సమస్యను పరిష్కరించడం కాదు, సృష్టిస్తానని చెప్పడం బాధాకరమన్నారు. టీడీపీ నేతలతో పాటు కొంతమంది అధికారులు ఓవరాక్షన్‌ చేస్తున్నారని, జగన్‌ సీఎం అయితే చంద్రబాబు ఇక్కడ నుంచి పారిపోతారని, అలాంటి అధికారులు ఆత్మపరిశీలన చేసు​కొని, ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని అన్నారు.

Related

  1. చంద్రబాబుకు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన జగన్
  2. మంత్రుల ముందు లోకేష్ ఓ రెంజ్ లో సీరియస్ అయిన చంద్రబాబు
  3. చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారిన టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌వి
  4. చంద్ర‌బాబు వ్యూహానికి… శిల్పా,భూమా వ‌ర్గాలు మ‌టాషేనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -