Thursday, May 16, 2024
- Advertisement -

త్వ‌ర‌లోజ‌గ‌న్‌తో శిల్పామోహ‌న్‌రెడ్డి భేటీ

- Advertisement -
Nandyal TDP Leader Shilpa Mohan Reddy likely to join YSRCP

నంద్యాల టీడీపీ సీనియ‌ర్‌నేత శిల్పామొహ‌న్‌రెడ్డి వైసీపీలోకి వెల్లేందుకు లైన్ క్లియ‌ర్ అయ్యింది. నంద్యాల ఉప ఎన్నిక టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయ‌న   పార్టీ మారేందుకు నిర్ణ‌యంతీసుకున్నారు. అన్నీ కుదిరితే రెండు మూడు రోజుల్లోనే  జ‌గ‌న్‌తో భేటీ అయ్యి త‌న అనుచ‌ర గ‌నంతో పార్టీలో చేరేందుకు  సిద్దంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. టికెట్ కోసం పార్టీలో తీవ్ర‌పోటీ ఉన్నా   ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ సూచించిన లేదా భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. టికెట్‌ను ఆశించిన శిల్పామోహ‌న్‌రెడ్డికి  బాబు మొండిచేయి చూపించ‌డంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  ఎంత ప్ర‌య‌త్నించినా ప‌లితం లేక‌పోవ‌డంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసిపిలో చేరి అయినా సరే టిక్కెట్ దక్కించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. 2014లో భూమాపై తాను పోటీ చేశానని, ఇప్పుడు కూడా తనకే టిక్కెట్ ఇవ్వాలని శిల్పా పట్టుబడుతున్నారు.

భూమా నాగిరెడ్డితో సీఎం చంద్రబాబు సయోధ్య కుదిర్చి, తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఎంపీ, అసెంబ్లీ టిక్కెట్ మనకే ఇస్తామని చెప్పారని, కాబట్టి ఓపిక పట్టాలని శిల్పా చక్రపాణి రెడ్డి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డికి చెప్పారని తెలుస్తోంది. ఈ విషయంలో ఇరువురికి వాగ్వాదం కూడా జరిగిందని సమాచారం.ఇప్పుడు టిక్కెట్ కోరుకున్న అఖిలప్రియ కుటుంబ సభ్యులు 2019లో వదులుకునేందుకు ఎలా సిద్దపడాతారనేది ఆయన వర్గం వాదనగా తలుస్తోంది. ఎలాగూ టిక్కెట్ భూమా కుటుంబానికి కన్‌ఫర్మ్ అయిందని చెబుతున్నారు. కాబట్టి కచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.

వైసీపీ టికెట్టు మీద గెలిచి  టీడీపీ వెల్ల‌డం జీర్నించుకోలేని జ‌గ‌న్  శిల్పా మోహ‌న్‌రెడ్డి ద్వారా చెక్క పెట్టాల‌నీ  భావిస్తున్నట్లు స‌మాచారం. 2014లో నంద్యాల సీటు త‌మ‌దేన‌ని … ఇప్పుడుకూడా అక్క‌డ పోటీ చ‌స్తామ‌నీ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.శిల్పామోహ‌న్ రెడ్డికి టికెట్ ఇచ్చి అక్క‌డ సీటు గెలిచేందుకు  అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే టీడీపీ కూడా అంతే ప‌ట్టుద‌ల‌తో ఉంది. శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారినా వచ్చే ఇబ్బందులేవీ ఉండవని, సులభంగా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ కూడా అంతే ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. భూమా కుటుంబానికి ఉన్న పట్టు, వారి కుటుంబం నుంచి పోటీ చేస్తే మద్దతిస్తామని సీనియర్లు చెప్పడం, శిల్పా చక్రపాణి రెడ్డి సహకారం.. ఇలా అన్ని కలిపి టిడిపి గెలుపు సాధ్యమని భావిస్తున్నారు.

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -