Sunday, June 16, 2024
- Advertisement -

23 నుంచి బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌నున్న పేటీఎమ్

- Advertisement -
Paytm To Start its Payments Bank operations from 23 May

బ్యాంకింగ్ రంగంలోకి ఈ వ్యాలెట్ దిగ్గ‌జం పేటీఎమ్‌ రాబోతోంది.ఇప్ప‌టి వ‌ర‌కుఈ వాలెట్ ద్వార సేవ‌లు అందించిన పేటీఎమ్‌ మే 23 నుంచి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు సాగించేందుకు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు ఆర్‌బీఐ తుది అనుమతులు మంజూరు చేసింది.

ఈ విషయాన్ని బ్యాంకు పబ్లిక్‌ నోటీస్‌లో తెలియజేసింది. ఈ బ్యాంకు లైసెన్స్‌ విజయ శేఖర్‌ శర్మ పేరుతో మంజూరైంది.త్వ‌ర‌లోనే పేటీఎమ్ బ్యాంకుల‌ను ఏర్పాటు చేయ‌నుంది. కంపెనీ తన ఈ వాలెట్‌ వ్యాపారాన్ని ఈ బ్యాంకుకు బదిలీ చేయనుంది. దీనికి ఇప్పటికే 21.8 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మే 23 తర్వాత నుంచి పేటీఎం వాలెట్‌ పీపీబీఎల్‌లో భాగమవుతుంది .పేటీఎం సొంతమైన వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేరు మీదనే ఈ లైసెన్సులను పీపీబీఎల్ పొందింది.

{loadmodule mod_custom,Side Ad 1}

పీపీబీఎల్ లో పేటీఎం వాలెట్ కలుపడం ఇష్టంలేని వినియోగదారులు మే 23 కంటే ముందు పేటీఎంకు ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేటీఎం వెల్లడించింది.దీంతో వాలెట్ లో ఉన్న బ్యాలెన్స్ మొత్తాలను వినియోగదారుల అకౌంట్లోకి బదిలీ చేస్తామని చెప్పింది. మే 23 లోపలే వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని పేటీఎం సూచించింది. ఆరునెలల నుంచి వినియోగించని ఈ వాలెట్‌లోని మొత్తాలను వినియోగదారుల అనుమతితోనే పీపీబీఎల్‌లోకి మారుస్తారు. దీంతోపాటు పేటీఎం బ్యాంక్‌ రూ.లక్ష వరకు డిపాజిట్లను నేరుగా స్వీకరిస్తుంది.

Related

  1. గృహ‌రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఐసిఐసిఐ
  2. విండోస్ కొత్త అప్‌డేట్ వ‌చ్చే వ‌ర‌కు ఏటీఎంల‌ను తెర‌వ‌ద్దు ఆర్బీఐ…
  3. ఏయిర్ టెల్‌ మ‌రో కొత్త ప‌థ‌కం…
  4. రూ200 నోటును మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ క‌స‌ర‌త్తు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -