Tuesday, May 14, 2024
- Advertisement -

క‌ర్నాట ఫ‌లితాలే నంద్యాల ఎన్నిక‌ల్లో పున‌రావుత‌మ‌వుతాయా…?

- Advertisement -
Poll Management effect on Nandyal by election..?

క‌ర్నాట‌క‌లో రెండు స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఒకటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణించడంతో జరిగినది, మరోటి పార్టీ ఫిరాయింపుకు సంబంధించినది.కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న సంగ‌తి తెలిసిందే. బీజేపీకి ఉన్న సానుకూల పరిస్థితులు.. ఆ రెండింటి నేపథ్యంలో అక్కడ బీజేపీ విజయం ఖాయమని అంతా లెక్కేశారు.ఎన్నిక‌లు జ‌రిగాయి..ఫ‌లితాలు వ‌చ్చాయి..సీన్ ఖ‌ట్ చేస్తె అధికార పార్టీదే గెలుపు.

{loadmodule mod_custom,GA1}

నంద్యాల ఉప ఎన్నిక‌ను ఇరు పార్టీలు ప్ర‌తీస్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఈఎన్నిక‌లో వైసీపీదే గెలుపుని స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి.అయితే ఇప్పుడు మ‌రోలా ఉంది. క‌ర్నాట‌క‌లో ఉత్ప‌న్న‌మ‌యిన‌ దాదాపు అలాంటి పరిస్థితుల నడుమే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అమీతుమీ తలపడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు చేతిలో అన్ని అస్త్రాలూ ఉన్నాయి.
అధికారంలో ఉన్న పార్టీ ఎన్నిక‌ల నాటికి ఏదైనా చేయ‌గ‌ల‌దు.అప్ప‌టిలోగా సంక్షేమ ప‌థ‌కాలు,అభివృద్ది కార్య‌క్ర‌మాలను చేయ‌డంతోపాటు…ప్ర‌తిప‌క్ష‌పార్టీ నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకోవ‌డం బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య.ఇన్ని అనుకూల‌త‌లు ఉన్నా మరి విజయం విషయంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అంత కాన్ఫిడెన్స్‌ లేకపోవడం గమనించాల్సిన అంశం.
నంద్యాల్లో గనుక టీడీపీ ఓడితే… చంద్రబాబు పాలననే కాదు, చంద్రబాబు సమర్థతను కూడా అనుమానించాల్సి వస్తుంది. పోల్‌ మేనేజ్‌ మెంట్‌తో నెగ్గడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటుంటారు కదా.. ఆ అభిప్రాయమే మారుతుంది కూడా..!

{loadmodule mod_custom,GA2}

శిల్పా వైసీపీలో చేరిన త‌ర్వాత నంద్యాల‌లో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేసిన బాబు రాజకీయంగా వాడుకోవాల‌నుకున్నారు.అంతే అది రివ‌ర్స్ అయ్యింది. జనాలు రాలేదని చంద్రబాబు అసహన భరితుడయ్యాడని తెలుగుదేశం అనకూల మీడియానే రాసింది.ఇక ఇతర పరిస్థితులు కూడా ఏ మాత్రం సానుకూలంగా లేవనే అభిప్రాయమే వినిపిస్తోంది. అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి క‌ర్నాట‌క ఉన్న ఎన్నికే ఇక్క‌డ కూడా పున‌రావృతం అవ‌డంలో సందేహంలేద‌నుకోవాలి.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}vED1OYzkNJ8{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -