Tuesday, May 14, 2024
- Advertisement -

నంద్యాల కోసం ఊహించని ప్లాన్ వేసిన టీడీపీ..?

- Advertisement -
Nandyal by elections

నంద్యాల ఎన్నిక.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో.. పెద్ద సంచలనం అయ్యింది. వైసీపీ, టీడీపీ సవాల్ గా తీసుకోవటంతో.. ఒక్కసారిగ హైప్ వచ్చింది. ఇద్దరిలో.. ఎవరు ఓడినా.. మానసికంగా దెబ్బ కొట్టే ఆలోచనలో ప్రత్యర్ధులు ఉంటారు కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోను గెలుపే లక్ష్యంగా పెట్టుకొని.. వ్యుహాలు రచిస్తున్నారు.

ఈ విషయంలో అధికార పార్టీ అయిన టీడీపీ.. ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం కేబినెట్ ను నంద్యాలలో మోహరించే విధంగా ప్లాన్ చేసింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. .. అభ్యర్థి నామినేషన్ పూర్తవ్వగానే.. కేబినెట్ మినిస్టర్స్ అందరూ నంద్యాల బాట పట్టాలని ఇప్పటికే సంకేతాలు వెళ్లాయి పార్టీ నుంచి. ప్రతి మండలానికి ఇద్దరు మంత్రులను కేటాయించనుంది టీడీపీ.

{loadmodule mod_custom,GA2} 

అయా మండలాల్లో కుల, మత, వర్గాల ఓట్లకు అనుగుణంగా ఈ మంత్రుల కేటాయింపు ఉండనుంది.  బూత్ కమిటీ స్థాయిలో ఏ ఒక్కరు కూడా జారిపోకుండా చూసుకోవటం.. పోల్ మేనేజ్ మెంట్ ను పక్కాగా అమలు చేయటం ఈ మంత్రుల బాధ్యత. నిజానికి.. ఈ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 2014లో శిల్పామోహన్ రెడ్డిపై.. భూమా నాగిరెడ్డి కేవలం 3వేల 604 ఓట్లతోనే గెలిచాడు. ఈ సారి అదే శిల్పా టీడీపీని కాదని.. వైఎస్‍ఆర్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. అంతే ప్రత్యర్ధులు మారారు. దీంతో మరింత ఆసక్తికరంగా ఉంది. పట్టింపులు, సవాళ్లతో రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారటంతో.. ఎలా అయిన సరే గెలుపే లక్ష్యంగా టీడీపీ మొత్తం మంత్రివర్గాన్నే నంద్యాలలో మోహరించనుంది. మరి గెలుపు ఎవరిదో చూడాలి. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రాసుకో సాంబా… నంద్యాల గెలుపు వైసీపీదే..
  2. నంద్యాల‌లో టీడీపీ ఆశీర్వాద యాత్ర‌…షురూ..!
  3. నంద్యాల ప్ర‌జ‌ల‌కు ఆర‌చేతిలో వైకుంఠం చూపుతున్న‌ గ్రాఫిక్స్ నారాయ‌ణ‌
  4. నంద్యాల పక్కా వైసీపీదే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -