Thursday, May 9, 2024
- Advertisement -

పార్టీ నుంచి సీనియ‌ర్ నాయ‌కులు ఔట్‌….

- Advertisement -
Prasant Kishor Effect on Senior Leaders of YSRCP for 2019 Elections

2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని వైసీపీ అధినేత ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.దీనికోసం ఇప్ప‌టినుంచే కార్యాచ‌ర‌న మొద‌లు పెట్టారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహాలు అమ‌లుచేయాలి,ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి,క్షేత్ర‌స్థాయిలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌నే ప‌లు అంశాల‌పై స‌ల‌హాలు సూచ‌న‌ల‌కోసం ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్తాగా పేరున్న ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

{loadmodule mod_custom,GA1}

అయితే ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నివేదికలు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ వాస్తవ పరిస్థితి, నాయకుల పనితీరు, వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల‌ను సేక‌రించి ఒక నివేదిక‌ను జ‌గ‌న్‌కు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.దీని ఆదారంగానే జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.
ఈనివేదిక ప్ర‌కారం ఇద్దురు ఉత్త‌రాంధ్ర‌నాయ‌కుల‌పై వేటు ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది.పేరుకు సీనియ‌ర్ నాయులు,మాజీ మంత్రులైనా వీరిపై ప్ర‌జ‌ల‌ల్లో తీవ్ర వ్య‌తిరేక ఉన్న వారంద‌రిని దూరం పెట్టాల‌ని చూస్తున్నారు జ‌గ‌న్‌.ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ కీలక నేతలుగా చలామణి అవుతున్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు ఉండటం విశేషం.వీరిరువురితో పాటు దాదాపు 35 నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలపై కూడా ప్రశాంత్‌ ఇలాంటి నివేదిక ఇచ్చినట్టు పార్టీ నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది.
వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో మంత్రిగా ఉన్న స‌మ‌యంలో బొత్స వోక్స్ వ్యాగ‌న్‌,ద‌ర్మాన వాన్ పిక్ భూముల కుంభ‌కోనంలో,గ‌నుల అక్ర‌మ త‌వ్వాకాల్లో తీవ్ర ఆరోప‌న‌లు వ‌చ్చాయి.వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యం కార‌నంగా మ‌ళ్లీ మంత్రివ‌ర్గంలోకి చేర్చుకోవ‌డంతో ప్ర‌జ‌ల‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది.రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయికి, చివరికి నియోజకవర్గ స్థాయికి వీరి గ్రాఫ్‌ పడిపోయింది.
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అవినీతి కుంభకోణాలపై పోరాడుతున్న ప్రతిపక్షానికి ఈ నేతలిద్దరి ప్రస్థానం ఇబ్బందికరంగా మారింది.వీరిరువురే కాకుండా దాదాపు 35మంది పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిలకు వ్యతిరేకంగా ప్రశాంత్‌ రిపోర్ట్‌ సమర్పించారట. దీంట్లో ఎవరెవరి పేర్లున్నాయోనని పార్టీ నేతలు కలవర పడుతున్నారు.

{loadmodule mod_custom,GA2}

దీంతో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై జగన్‌ మరింత దృష్టి సారించనున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు.టీడీపీపై అసంతృప్తంగా ఉన్న నేత‌లు పార్టీలోకి రావ‌డానికి స్థానికంగా ఉన్న నేత‌ల వ‌ల‌న ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు కిషోర్ నివేదిక సారాంశం.వచ్చేనెలలో జరగబోయే పార్టీ ప్లీనరీ సమావేశం అనంతరం కీలక పరిణామాలు జరగవచ్చని నేతలు ఊహిస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}TMwDNIMJj-0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -