Monday, April 29, 2024
- Advertisement -

పార్టీ మారిన నేతలే టార్గెట్?

- Advertisement -

పార్టీ మారిన నేతలే తమ టార్గెట్ అని చెబుతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్..17 స్థానాల్లో కనీసం మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని భావిస్తోంది. అలాగే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరి టికెట్లు దక్కించుకున్న నేతల ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు గులాబీ బాస్.

వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య,సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్, చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్,మల్కాజ్‌గిరి సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్,నాగర్ కర్నూల్ అభ్యర్థి భరత్‌ లు బీజేపీలో చేరారు. ఈ ఆరుగురి ఓటమి లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు శ్రమించాలని చెబుతున్నారు కేసీఆర్.

ఈ ఆరు స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించగా ఇప్పటికే కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ఎంపీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఇంఛార్జీలు పనిచేస్తున్నారు. ఇక వరంగల్ మినహా మిగితా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇక్క బలమైన క్యాండిడేట్ కోసం చూస్తున్నారు. త్వరలోనే అభ్యర్థి ప్రకటన ఉండనుండగా మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నారు కేసీఆర్. మరి బీఆర్ఎస్ అధినేత చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -