ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ప్రస్తుతం మంత్రులు అందరూ చాలా సీరియస్ గా ఉన్నారు అని తెలుస్తోంది. ఆయన తీసుకున్న తాజా నిర్ణయం వారికి అవమాన కరంగా, అయిష్టంగా ఉందట. పైకి ఏమీ మాట్లాడలేక పోయినా లోలోపల అసహనంగా ఉన్నారట వారు.
ప్రభుత్వ పాలన లో మంత్రులకి అవకాశం అనేదే ఇవ్వకుండా పూర్తిగా తానే అన్నీ అన్నట్టు కథ నడుపుతున్న చంద్రబాబు మీద వారు కష్టపడుతున్నా కూడా అంతా వృధా అవుతోంది అని ఇబ్బందిగా ఉన్నారట. ఏదైనా వ్యూహంతో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని మంత్రులతో చెప్పాల్సి ఉన్నా.. అలాంటిదేమీ లేకుండానే.. తాను చెప్పినట్లు వినాలంటూ ఆయన వ్యవహరించిన తీరుపై ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉంది.
ఇంతకు జరిగిందేమంటే.. పంద్రాగస్టు సందర్భంగా వివిధ జిల్లాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించకుండా ఇతర జిల్లాలకు చెందిన మంత్రుల చేత జెండా ఆవిష్కరణ చేయించటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.