Tuesday, May 6, 2025
- Advertisement -

నోట్ల రద్దు 11 మంది బ్యాంక్ స్టాఫ్ ని చంపేసింది

- Advertisement -
Thomas Franco Responds on notes Ban

ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తో జరిగే లాభాల సంగతి ఎలా ఉన్నా నష్టాలు మాత్రం వెంట వెంటనే బయట పడుతున్నాయి. డిసెంబర్ నెలాఖర్లో , జనవరి మొదట్లో మోడీ ఈ విషయంలో జరిగిన పురోగామానం చూపిస్తా అంటున్నారు కానీ ఈలోగానే ఇక్కడ జనాలకి చుక్కలు కనపడుతున్నాయి అనేది మాత్రం వాస్తవం. తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా దాన్ని సమర్థవంతంగా అమలు చేసే విషయంలో అధికారులు చేస్తున్న తప్పులు.. పలువురి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

నోట్ల రద్దు నేపథ్యంలో నగదు లభ్యత విషయంలో ఏర్పడిన కొరత కారణంగా.. విత్ డ్రా కోసం.. నగదు మార్పిడి కోసం క్యూ లైన్లలో గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన దుస్థితి. బ్యాంకుల దగ్గర క్యూ లలో నుంచుని ఎందరో చనిపోతున్న తరుణం లో దాదాపు ౩౦ మంది చావుల తరవాత కూడా ఇంకా పరిస్తితి చేతికి రాలేదు . బ్యాంకు అధికారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ థామస్ ఫ్రాంకో ఈ విషయం మీద ఆసక్తికర విషయాలు చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేసేందుకు సరైన రోడ్ మ్యాప్ లేదని విమర్శించిన ఫ్రాంకో.. గతాన్ని గుర్తు చేశారు.

1978లో అప్పటి మోరార్జీ దేశాయ్ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సందర్భంగా నాటి ఆర్ బీఐ గవర్నర్ ఐజీ పటేల్.. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. ప్రధాని మోడీకానీ.. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కానీ ఆర్థికవేత్తలు కారని.. ఒక ఆర్థికవేత్తగా ఉన్న ఉర్జిత పటేల్ నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా తప్పు చేశారన్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన తీవ్ర గందరగోళానికి.. సామాన్య ప్రజల మరణాలకు నోట్ల రద్దు నిర్ణయం ఒక కారణంగా తేల్చారు.నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన 12 రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 11 మంది బ్యాంకు సిబ్బంది మరణించినట్లుగా తేల్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -