Sunday, May 12, 2024
- Advertisement -

రూపాయికే అన్‌లిమిటెడ్‌ 4జీ డేటా!

- Advertisement -
unlimited 4g data just one rupee

దేశ‌వ్యాప్తంగా బంప‌ర్ ఫ్రీ ఆఫ‌ర్ల‌తో ఎంతోమంది యూజ‌ర్ల‌ను తన వైపు తిప్పుకుంది జియో. దాంతో మిగిలిన టెలికం కంపెనీలు సైతం బంప‌ర్ ఫ్రీ ఆఫ‌ర్ల‌తో ముందుకు దూసుకొస్తూ జియో కి గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో భాగంగా అన్ని కంపెనీలు భారీ ఆఫర్లకు తెరలేపాయి. కస్టమర్లను ఆఫర్లలో ముంచెత్తుతున్నాయి. దీంతో కొద్ది రోజులుగా టెలికం మార్కెట్‌లో ఎవ‌రికి వారు వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఆఫర్లు ప్ర‌క‌టిస్తున్నారు. ఈ నెపథ్యంలో ఐడియా రూపాయికే అన్‌లిమిటెడ్‌ 4జీ డేటాను తీసుకొచ్చింది.

అయితే ఈ సరికొత్త ఆఫర్ ను ఎలా పోందాలంటే..? మీ వద్ద ఐడియా 4జీ సిమ్‌తోపాటు తప్పనిసరిగా 4జీ సపోర్ట్‌ చేసే ఫోన్‌ ఉండాలి. దీంతో పాటు మీ అకౌంట్‌లో రూపాయి బ్యాలెన్స్‌ ఉండాలి. మీ 4జీ హ్యాండ్‌సెట్‌లో ఐడియా సిమ్‌ ఉంచి 411కు కాల్ చేయాలి. ఆ కాల్ త‌ర్వాత అక్క‌డ చెప్పే సూచ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. ఆ సూచనలను పాటించిన తర్వాత మనకు వెంటనే 4జీ డేటా యాక్టివేట్ అయ్యినట్టే.. ఓ మెసేజ్ ద్వారా మ‌న‌కు క‌న్‌ఫ‌ర్‌మేష‌న్ వ‌స్తుంది. అయితే ఇక్క‌డే ఐడియా ఓ మెలిక పెట్టింది. ఈ అన్ లిమిటెడ్ డేటా కేవ‌లం ఓ గంట వరకు మాత్రమే.

గంట తరువాత మీకు డేటా పనిచేయదు. ఈ ఆఫర్‌లో మీరు ఐడియా ఇచ్చే సూపర్‌ ఫాస్ట్‌ డేటాను గంట వరకు అపరిమితంగా వాడుకోవచ్చు. ఈ ఆఫ‌ర్ యాక్టివేట్ అయిన తరువాత మీ పాత డేటా ప్యాక్‌ వెంటనే ఆగిపోతుంది. ఒకే నంబర్‌పై ఈ ఆఫర్‌ను మూడుసార్లు వాడకోవచ్చు. ఆ తరువాత ఈ ఆఫర్‌ పనిచేయదు. వేరే ఫోన్‌ నుంచి ప్రయత్నిస్తే మళ్లీ ఈ ఆఫర్‌ మీకు వచ్చే అవకాశం ఉంది.

Related

  1. అతి తక్కువ దరకే ఎయిర్‌టెల్ 10 జీబీ డేటా!
  2. ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
  3. షాక్ చేసే పీవీ సింధు ఫోటో షూట్!
  4. ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ ఇస్తే సబ్బు పంపించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -