చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో మరణించినవారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు.ఆదివారం ఉదయం ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్ జగన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.
రేణిగుంట విమానాశ్రయం నుంచి మునగలపాలెం చేరుకున్న జగన్ కు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.మునగలపాలెంలో 13 మంది మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇసుక మాఫియా వల్లే తమవాళ్లు చనిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన దానికి టీడీపీ నేతలే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు వైఎస్ జగన్ వద్ద గోడు వెళ్లబోసుకొని తమకు న్యాయం చేసేందుకు పోరాటం చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుక తరలింపుతో రోజూ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. ఏర్పేడులో 17మందిని పొట్టనపెట్టుకున్నది కూడా ఇసుక మాఫియానేనని విమర్శించారు. ఇసుక మాఫియా ను అడ్డుకోవాలన్న తమ మొరపై అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునగలపాలెం నుంచి వైఎస్ జగన్ ముసిలిపేడు, రావిళ్లవారి పల్లె అరుంధతివాడ ప్రాంతాలకు వెళతారు. మార్గమధ్యంలో స్వర్ణముఖి నదిలో ఇసుక గుంతలను పరిశీలించనున్నారు. ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏర్పేడు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లి, తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన దుర్ఘటనలో 17 మంది దుర్మరణం చెందగా, మరో 15 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.
Also Read
- నంద్యాల ఎన్నిక సెంటీమెంట్ అస్త్రం టీడీపీకీ ఫలిస్తుందా..?
- మరో సంచలనం.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
- కాన్ఫిడెన్సా …. ఓవర్ కాన్ఫిడెన్సా
- జగనే సీఎం…. ఇది పిక్స్
{loadmodule mod_sp_social,Follow Us}