Sunday, May 19, 2024
- Advertisement -

నంద్యాల ఎన్నిక సెంటీమెంట్ అస్త్రం టీడీపీకీ ఫ‌లిస్తుందా..?

- Advertisement -
Nandyal by poll is a big war to Chandrababu

నంద్యాల ఉప ఎన్నిక బాబు పాల‌కు గీటురాయి కాబాతోందా…!  అస‌లు ఎన్నిక‌లంటేనే బాబు బ్యాచ్‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా  ధైర్యంగా ఎన్నిక‌లు ఎదుర్కొంటామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నా …లోల‌ప‌ల మాత్రం  పంచ‌లు త‌డుపుకుంటున్నారు.

బాబు పాల‌న‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌నీ  మీడియాముందు,స‌భ‌లు, స‌మావేశాల్లో మైకుల ముందు ఊద‌ర‌గొట్ట‌డం త‌ప్ప …నిజంగానే ఎన్నిక‌ల‌ను ఎందుర్కొనే  ధైర్యం ఉందా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. ఇప్ప‌టికే పెండింగ్‌లో ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను నిర్వహించడానికి  ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంది…. ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు ఇచ్చి.. వారిచేత రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు వెల్ల‌డం .. తెలుగుదేశం పార్టీకి ఎన్నికలంటే చాలా భయం ఉందనే విషయం స్పష్టంగానే అర్థం అవుతోంది.

ఎన్నికలంటే.. అవి స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లాగా ఉండాలి. అదీ టీడీపీ కోరిక. క్యాంపు రాజకీయాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, కొనుగోళ్లు ఇవ‌న్నీ ఉంటే టీడీపీకీ ఇష్టం. అన్ని ఎన్నిక‌లు అలానే ఉండ‌వుక‌దా.. కానీ ఇప్పుడు నంద్యాల ఉపెన్నిక   టీడీపీ శ్రేనుల్లో  వ‌నుకు పుట్టిస్తోంది. ఇప్పటికే టికెట్టు కేటాయింపులో నెల‌కొన్న అస‌మ్మ‌తి  బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గాన్ని పెదబాబు, చినబాబులు కలిసి బ్యాలెన్స్‌ చేయలేకపోతున్నారు. ఎలాగూ సిట్టింగ్ ఎమ్ఎల్ఏ చ‌నిపోతే అస్తానంలో సానుభూతి అస్త్రాన్ని ఉపయోగించుకుని ఈ ఎన్నికల్లో నెట్టుకురావాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఎవ‌రైనా చ‌నిపోతే అస్తానంలో ఎవ‌రూ పోటీచేకుండా వారి కుంటుంలో ఎవ‌రో ఒక‌రికి ఏకగ్రీవంగా ఎన్నుకొనేవారు. కానీ నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో  మాత్రం సీన్ రివ‌ర్స్ అవుతోంది.ఇక్క‌డి నుంచి ఖ‌శ్చ‌తంగా వైసీపీ పోటీచేస్తూంద‌ని ఆపార్టీ ప్ర‌క‌టించ‌డంతో గెలుపుపై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతోంది టీడీపీకీ.

భూమా కుంటుంబంనుంచి పోటీ చేసినంత మాత్రానా  సానుభూతి వెల్లువెత్తుతుంది అనే నమ్మకం క్రమంగా తగ్గిపోతోంది.  ఇప్ప‌టికే వైసీపీ నుంచి టీడీపీలోకి వెల్ల‌డంతో  భూమాకుంటుంబం  ఆయ‌న సామాజిక వ‌ర్గం మ‌ద్ద‌తు కొల్పోయారు.  గ‌తంలోతన తండ్రికి ఏమైనా జరిగితే దానికి చంద్రబాబే బాధ్యత వహించాలని.. భూమా నాగిరెడ్డి బతికి ఉన్న రోజుల్లో మాట్లాడిన అఖిలప్రియ, చివరకు భూమా నాగిరెడ్డి మరణించాకా.. చంద్రబాబు బొమ్మ పెట్టుకుని ఓటు అడిగితే.. ఓటేసే వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారా  అన్న సందేహం క‌లుగుతోంది. ఎలాగూ పార్టీలో టికెట్టు కేటాయింపులో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఉండ‌నే ఉన్నాయి. ఒక వ‌ర్గానికిటెకెట్టు ఇస్తే ఇంకోవ‌ర్గం స‌హ‌క‌రించ‌మ‌ని బ‌హిరంగంగానే చెబుతున్నారు.

చంద్రబాబు పాలన తీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది? అనేది కొంత వరకూ క్లారిటీ వస్తుంది.  రెండు రోజుల క్రితం రాష్ట్రంలో టీడీపీ ఓటుబ్యంక్ పెరింద‌ని ….అదే విధంగా వైసీపీ ఓటుబ్యాంకు త‌గ్గింద‌ని చెప్పుకొచ్చారు.    డబ్బు పంపకం, కనీసం అరడజను మంది మంత్రులు వెళ్లి నంద్యాలలో కూర్చోవడం.. వంటి అంశాలు.. పోలీస్‌ వ్యవస్థను అధికార పార్టీ ఉపయోగించుకోవడం.. ఇవన్నీ కూడా టీడీపీకి సానుకూలంగా నిలిచే అంశాలు.  అయితే ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంటే.. ఇవన్నీ కూడా దూదిపింజలే.  ఫిరాయింపుదారులపై ప్రజలు ఎలాంటి ధోరణితో ఉన్నారు.. చంద్రబాబు పాలన మీద ఎలాంటి అభిప్రాయం ఉంది.. అనే అంశాలకు నంద్యాలలో సమాధానం దొరకవచ్చు. అయితే ఇలాంటి ఉపఎన్నికల్లో అధికార పార్టీలు విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది.  ఒక వేల నంద్యాల ఉప ఎన్నిక తీర్పు టీడీపీకీ వ్య‌తిరేకంగా వ‌స్తే బాబు పాల‌న‌కు కౌంట్ డౌన్   మొల‌యిన‌ట్లే. మ‌రి నంద్యాల ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇస్తారో మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే…..

Also Read

  1. నెటి జ‌న్ల‌కు జ‌గ‌న్ పిలుపు….. నేను అండ‌గా ఉంటా..
  2. భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనికకు నంద్యాల వైసీపీ టికెట్
  3. ఆస‌క్తిని రేపుతున్న నంద్యాల బైపోల్‌ బాబు మాటంటే లెక్క‌లేదు
  4. అఖిల ప్రియ చెల్లెలు మౌనిక పోటీచేస్తుందా..!

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -