- Advertisement -

2000 నోటు నకిలీనోటు అవునో కాదో ఇలా గుర్తించండి!

- Advertisement -
security features of 2000 rupee note

దేశంలో 500, 1000 నోట్లు రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త 500, 2000 నోట్లను ప్రవేశపెట్టారు. అయితే ఈ కొత్త 2000 నోటులో చిప్ ఉందని.. ఈ చిప్ ద్వారా  నల్ల ధనాన్ని కనిపెట్టొచ్చు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం చెప్పింది.

అసలు ఈ 2000 నోటులో చిప్ లేదని కేంద్రం సృష్టం చేసింది. అయితే.. రూ. 2 వేల నోటులో ఎవరికీ తెలియని అద్భుత ఫీచర్ ఉన్నట్లు  వెల్లడి అయింది. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ట్విట్టర్ ధ్వారా తెలిపింది. ఇందులో ‘ఇంటాగ్లియో’ అనే ఫీచర్ ఉందని.. ఇందులో భాగంగా కాగితంలోకి ఒక రకమైన డిజైన్‌ ని చొప్పిస్తారని వివరించింది.

అసలైన నోటు ఏదో, నకిలీ నోటు ఏదో గుర్తించాలంటే ఒక వస్త్రాన్ని తీసుకుని దాంతో నోటు మీద రుద్దాలని.. అలా రుద్దినపుడు టర్బో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పుడుతుందని ఆర్థికశాఖ తెలిపింది. నోటులో ఉన్న ఇంకు వస్త్రంలోకి బదిలీ కావడం వల్ల అలా జరుగుతుందని.. అలా జరిగినప్పుడు చిన్నపాటి షాక్ లాంటిది తగిలితే అది అసలైన నోటు అని.. తగలకపోతే అది నకిలీనోటు అని గుర్తించవచ్చని స్పష్టం చేసింది. దీనితో ఆర్థికశాఖ ఈ కొత్త విషయాన్ని వెల్లడించడంతో కొత్తనోట్ల భద్రత విషయమై ఇప్పటిదాకా ఉన్న అనుమానాలు నివృత్తి అయినట్లే అని చెప్పవచ్చు.

Related

  1. నోట్ల కోసం ఏటీఎం దగ్గర ఓ యువ‌తి బట్టలు విప్పేసింది!
  2. పెద్ద నోట్లు ఏం చేసారు ? చించేసారా .. కాల్చేసారా ?
  3. మరో అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన జియో
  4. 2000 నోటులో కేంద్ర ప్రభుత్వం చిక్కులో పడింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -