పవన్ కు చెల్లిగా ఎవరో తెలుసా?

young hero lover as pavan sister

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ అనే సినిమా చేస్తూ బిజీ బిజీ అయ్యాడు. ఈ సినిమానే కాకుండా త్రివిక్రమ్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా.. అలాగే తమిళ దర్శకుడు నీసన్ దర్శకత్వంలో మ‌రో సినిమాలో న‌టించ‌నున్నాడు.

ఇక నీసన్ దర్శకత్వంలో పవన్ నటించే చిత్రంను స్టార్ ప్రొడ్యుస‌ర్ ఏఎం.ర‌త్నం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంన్య్ కోలీవుడ్ అజిత్ హీరోగా తెరకెక్కిన వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లిగా నేచుర‌ల్ స్టార్ నాని సినిమాలో నానికి ల‌వ‌ర్‌గా న‌టించిన నివేద థామ‌స్‌ను తీసుకున్న‌ట్టు స‌మాచారం. అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ ప్రధాన కథగా సాగే ఈ సినిమాలో త‌మిళ్‌లో అజిత్‌కు చెల్లిగా లక్ష్మీమ‌న‌న్ న‌టించింది.

శృతీహాస‌న్ హీరోయిన్‌. ఇప్పుడు తెలుగులో పవన్ సరసన స‌యేషా సైగ‌ల్ హీరోయిన్‌గా ఎంపికైంది. ప‌వ‌న్‌కు చెల్లి పాత్ర‌లో ప‌లువురు హీరోయిన్ల పేర్లు ప‌రిశీలించి నివేద‌ను ఎంపిక చేశార‌ట‌. నివేద నాని జెంటిల్ మాన్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమాలో నాని ల‌వ‌ర్‌గా నటించి మెప్పించింది. ఈ సినిమాకి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఇకపోతే ఈ లక్కీ హీరోయిన్ నివేద‌ థామస్ నానితో మరో సినిమాలో కూడా నటించనున్న సంగతి తెలిసిందే.

Related

  1. పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తు ఉందా ? ఇలా అయితే లీడర్ గా ఎదగడం కష్టం
  2. పవన్.. పవర్ స్టార్ కావడానికి కారణం ఎవరు?
  3. పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన నయనతార!
  4. పవన్ అభిమానులపై ఫైర్ అయిన ఝాన్సీ