Tuesday, April 30, 2024
- Advertisement -

పవన్.. పవర్ స్టార్ కావడానికి కారణం ఎవరు?

- Advertisement -
Posani Krishna Murali Took Credit for Power Star Title

పవన్ కళ్యాణ్ అనే పేరు చెప్పగానే.. ఆ పేరు కు ముందు పవర్ స్టార్ వచ్చి యాడ్ అయిపోతుంది. మెగాస్టార్ గా చిరంజీవి ఎంత ఫేమస్ అయ్యాడో.. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా అంతే… ఫేమస్ అయ్యాడు. పవన్ ఎనర్జీకి ‘పవర్ స్టార్’ బిరుదు పర్ఫెక్టుగా సూటయింది. అయితే పవన్ కళ్యాణ్ కి ఈ బిరుదు ఇచ్చిందెవరు? అసలు ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తున్నారన్న ప్రశ్నలకు పోసాని కృష్ణమురళి సమాధానం ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ కు ‘పవర్ స్టార్’ బిరుదు ఇచ్చింది తానే అని ఆయన ‘ధృవ’ ప్రి రిలీజ్ పంక్షన్ లో వెల్లడించాడు. ఈ వేడుకలో అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిస్తుండగా పోసాని ఈ విషయం వెల్లడించాడు. సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్యకు పోసాని ఆస్థాన రచయిత అన్న సంగతి తెలిసిందే.

సుబ్బయ్య దర్శకత్వంలో పవన్ ‘గోకులంలో సీత’ సినిమా చేశాడు. ఆ సినిమా సందర్భంగానే తాను పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చానని.. పవన్ నిజంగానే ఆ బిరుదుకు సార్థకం చేసుకున్నాడని పోసాని అనడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈ వేడుకలో మెగా హీరోలు రామ్ చరణ్.. అల్లు అర్జున్ ల మీదా ప్రశంసలు కురిపించాడు పోసాని. మెగాస్టార్ చిరంజీవి కొడుకైనప్పటికీ చరణ్ ఎంతో కష్టపడతాడని.. అతడి కష్టం అసామాన్యమైందని పోసాని అన్నాడు. బన్నీ టాలీవుడ్లో నెంబర్ వన్ డ్యాన్సర్ అని పోసాని కితాబిచ్చాడు.

Related

  1. పవన్ కళ్యాణ్ తొందర పడకు .. తరవాత బాధపడతావ్ 
  2. రైల్వే స్టేషన్ విలన్ల చితకబాదిన పవన్!
  3. 2000 నోటుని పరిశీలిస్తున్న పవన్!
  4. పవన్ కు ట్విట్టర్ లో 1 మిలియన్ ఫాలోవర్లు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -