నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాలకృష్ణ 100 సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ ఓ రెంజ్ లో ఉండటంతో… సంబర పడ్డ ఫ్యాన్స్, ఆ ట్రైలర్ గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించడం మరింత సంతోషాన్ని కలిగించింది.
“గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ అద్భుతంగా ఉంది. బాబాయ్ చాలా బాగా కనిపిస్తున్నారు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఇదివరకు సినిమాల కంటే బాబాయ్ ని ఇందులో గొప్పగా చూపించారు క్రిష్” అంటూ నిన్న ట్రైలర్ విడుదలైన వెంటనే ట్వీట్ చేశారు. దీంతో.. అబ్బాయికి బాబాయ్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవని తేలింది.
ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ ని ఐదువేలకి మందికి పైగా లైక్ చేశారు. ఇక నందమూరి కల్యాణ్ రామ్ కూడా ఈ మూవీ ట్రైలర్ చూసి “దేశం మీసం తిప్పుదాం” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాబాయ్ లుక్స్ ఔట్ స్టాండింగ్స్ అంటూ ప్రశంసించాడు. ఇక ఈ ట్రైలర్ యూట్యూబ్ లో 24 గంటలు గడవక ముందే 1.4 మిలియన్ పైగా వ్యూస్ ని రాబట్టి రికార్డ్ సృష్టించింది.
Related
