చికెన్ తెస్తే.. రూ.10వేల జరిమానా ఏంటి అనుకుంటున్నారా ఏంది? అవును నిజమే మీరు చదివింది. ఈ విచిత్రమైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి పోతే.. ఒక ఆన్ లైన్ ఫుడ్ స్టార్టప్ చేసిన పనికి కోర్టు రూ. 10వేల జరిమానా విధించింది. విష్ణు బైతనారాయణ నాగేంద్ర అనే యువకుడు 2018 ఏప్రిల్ 23న ఫ్రెష్ మెనూ అనే ఫుడ్ స్టార్టప్ లో క్వినోవా సలాడ్ ను ఆర్డర్ చేయాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే.. బుక్ చేశాడు.
ఇంకో విషయం అతను ఆర్డర్ చేసింది శాకాహార వంటకం. అయితే ఆ సంస్థకు చెందిన డెలివరీ బాయ్ ఆర్డర్ చేసిన వంటకానికి సంబంధించిన బాక్స్ ను తెచ్చి ఇచ్చాడు. ఆ బాక్స్ పైన కూడా ఆయన ఆర్డర్ చేసిన వంట పేరే ఉంది. ఆర్డర్ చేసిన వ్యక్తి ఆ దాన్ని తిందామని పార్శిల్ ను ఓపెన్ చేశాడు. దాన్ని చూడగానే అతని మతి పోయింది. కారణం అందులో శాకాహార వంటకం బదులుగా చికెన్ వంటకం ఉంది.
దీంతో అసంతృప్తికి గురైన ఆ వ్యక్తి వెంటనే ఆ ఫుడ్ స్టార్టప్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఆ స్టార్టప్ ప్రతినిధి క్షమాపణలు కూడా చెప్పాడు. ఫుడ్ ఐటమ్ కు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెప్పాడు. కానీ మాంసహారం తినని నాగేంద్ర ఊరుకోకుండా దీనిపై లీగల్ నోటీసులు జారీ చేశాడు. ఆపై జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.
దీన్ని పరిశీలించిన కోర్టు.. పరిహారంగా రూ.5 వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని స్టార్టప్ కంపనీకి తెలిపింది. అలాగే ఫుడ్ ఐటమ్ ఖర్చు రూ.210ని నాగేంద్రకు చెల్లించాలని సూచించింది. ఈ కేసులో 28 నెలల పాటు విచారణ సాగిందని నాగేంద్ర తెలిపాడు.
మోనాల్, అఖిల్ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ మొదలైంది !
నిధి అగర్వాల్ ఫ్యాన్స్ మాములుగా లేరు… ఏకంగా అదే చేశారుగా.. !
ఊరమాస్.. రామ్ కొత్త సినిమా మాములుగా ఉండదు… లింగుస్వామితో.. !
