జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్. ఈ హీరో కన్ను ప్రస్తుతం బాలీవుడ్‌పై పడింది. దీనిలో భాగంగానే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ, ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి సినిమాను హిందీ రీమేక్‌తో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు వివి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు.
అయితే, ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. గత కొన్ని రోజులుగా హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ఇదివరకు మూవీలో హీరోయిన్గా జాన్వీకపూర్ సహా పలు బాలీవుడ్ తారల పేర్లు వినిపించాయి. అయితే, వీటిపై స్పష్టత రాలేదు.
అయితే, తాజాగా పూరీ జగన్నాథ్ బ్యూటీ హిందీ చత్రపతిలో హీరోయిన్గా నటిస్తున్నదని టాక్ వినిపిస్తోంది. ఆ అందాల తార ఎవరనీ అనుకుంటున్నారా? అదే నండి లైగర్‌లో నటిస్తున్న అనన్య పాండే. ఎలాగైనా ఈ హాట్ బ్యూటీని హీరోయిన్గా ఫైనల్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నదట. దీని కోసం భారీ రెమ్మునరేషన్ సైతం ఆఫర్ చేయాలనుకుంటున్నారట.
రామ్ చరణ్, శంకర్ సినిమా కథ ఎలా ఉండబోతుందంటే..?
అభిమానుల ప్రేమకు పొంగిపోతున్న నిధి అగర్వాల్