Sunday, April 28, 2024
- Advertisement -

కోయ‌కుండానే ఎర్రటి పుచ్చకాయను ఇలా గుర్తించండి !

- Advertisement -

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుచ్చ‌కాల‌య సీజ‌న్ రానే వ‌చ్చింది. ఈ పండ్ల‌ను త‌న‌డం వ‌ల్ల శ‌రీరంలోని వేడిని త‌గ్గించ‌డ‌మే కాకుండా.. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను స‌రైన స్థితిలో ఉంచుతుంది. ఎండ‌కాలంలో పుచ్చ‌పండు క‌లుగ చేసే మేలు అంతాఇంతా కాదు. ఎందుకంటే ఇందులో ఉండే పోష‌కాలు, అధికంగా ఉండే నీరు శ‌రీరానికి మేలు క‌లుగ జేస్తుంది.

వేస‌వి తాపాన్ని, దాహాన్ని తీర్చ‌డంతో పుచ్చ‌కాయ‌ను మించిన ఫ‌లం మ‌రొక‌టి లేదు. మ‌రీ ముఖ్యంగా శ‌రీరానికి అవ‌స‌ర‌మైన నీటిని అందిస్తుంది. అలాగే, కామ కోరిక‌లు పెంచే ఔష‌ధ గుణాలు కూడా పుచ్చ‌కాయ‌లో ఉన్నాయ‌ని ఇటీవ‌లే ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అయితే, అయితే, పుచ్చ‌కాయ లోప‌ల ఎర్ర‌గా, మంచిగానే ఉందా? లేదా? అనేది కోయ‌కుండా తెలుసుకోవ‌డం కొద్దిగా క‌ష్ట‌మే.. అయితే, ఈ విష‌యాల‌ను తెలుసుకునేందుకు తాజాగా ప‌లువురు నిపుణులు ప‌లు సూచ‌న‌లు చేశారు.

వాటిలో ముఖ్య‌మైన‌ది మ‌నం కొనుక్కునే పుచ్చ‌కాయ క‌నీసం రెండు కేజీలు ఉండాలి. అంత‌కంటే ఎక్కువ‌గా ఉంటే మ‌రి మంచిది. పైకి క‌నిపించే పుచ్చ‌కాయ రంగు ఎలా ఉన్నా ప‌ర్వాలేదు. అలాగే, పుచ్చ‌కాయ తొడిమ ఎండిపోయిన‌ట్టు ఉండాలి. తొడిమ లేనిప‌క్షంలో దాని కింది భాగం ఎండిపోయిన‌ట్టుగా ఉన్న‌వి తీసుకోవాలి. బ‌రువుగా, గ‌ట్టిగా ఉండే వాటిని తీసుకోవాలి. మొత్త‌గా ఉండేవి పాడైపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. పైన తెలిపిన వివ‌రాల‌తో ఉన్న వాటిని తీసుకుంటే.. పుచ్చ‌కాయ‌పై ఉన్న చార‌ల గురించి ఆలోచించాల్సిన ప‌నిలేద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

మీరు కారణ జన్ములు.. తెలంగాణకు పండుగ రోజు : హరీష్ రావు

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్.. ‘వేశ్య’గా యాంకర్‌ అనసూయ!

జ‌క్క‌న్నా.. మ‌జాకా.. విడుద‌ల‌కు ముందే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల మోత !

స‌డన్ గా వ్యాయామం మానేస్తే.. ఏం జ‌రుగుతుంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -