Sunday, May 19, 2024
- Advertisement -

పిల్లలు పుట్టకుండా సింహానికి ఆపరేషన్!

- Advertisement -

సాధారణంగా పిల్లలు పుట్టుకుండా మనుషులకు ఆపరేషన్ చేయడం తెలిసిందే. ఈ ఆపరేషన్ ఆడవారు.. మగవారు చేయించుకుంటారు. తాాజాగా ఓ సింహానికి ఆపరేషన్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. నెదర్లాండ్స్ లోని ఓ జూలో ఐదు కూనలకు తండ్రైన ఓ సింహానికి వేసక్టమీ ఆపరేషన్ చేశారు. థార్ అనే 11 ఏళ్ల మగసింహం జూలోని రెండు ఆడ సింహాలతో జతకలిసింది. వీటిలో మొదటి దానికి రెండు, రెండో దానికి మూడు కూనలు పుట్టాయి.

వెటర్నరీ డాక్టర్ హెంక్ లూటెన్ ఆధ్వర్యంలో సింహానికి ఈ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత హెంక్ లూటెన్ మాట్లాడుతూ .. ఇప్పటికే థార్ డీఎన్ఏ తమ జూలో చాలా ఉందని తెలిపారు. దాని జన్యు సమూహం ఎక్కువగా ఉండాలని మేం అనుకోవడం లేదని, దాని సంతతి వృద్ధి చెందే అవకాశం ఉంటడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

సింహానికి వేసక్టమీ చెయ్యడం చాలా అరుదని, పిల్లల నియంత్రణ కోసం ఎక్కువగా సింహానికి కాస్ట్రేషన్ చేస్తారని.. దీని వలన సింహాలు అనారోగ్యానికి గురి అయి చనిపోతాయని అన్నారు. కాస్ట్రేషన్ (వీర్యహరణం) చేయడం వలన సింహం జూలు త్వరగా ఊడిపోయి బలహీనపడి అనారోగ్యానికి గురి అవుతాయని అన్నారు. అందుకే తన 35 ఏళ్లలో ఒక సింహానికి ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి అని వెటర్నరీ డాక్టర్ వెల్లడించారు.

హైదరాబాద్ లో జలకన్య ఆకారంలో వింత శిశువు జననం!

చెర్రీ సరసన మరోసారి బాలీవుడ్ బ్యూటీ!

అడ్డంగా దొరికిపోయిన రేవ్ పార్టీ.. అమ్మాయిలు తో పాటు 90 మంది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -