Saturday, April 20, 2024
- Advertisement -

మెరిసే ముఖ సౌంద‌ర్యం కోసం.. ఈ చిట్కాలు !

- Advertisement -

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ముఖం మెరిసిపోవాలని కలలుగంటారు. అందుకోసమే మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను ట్రై చేస్తుంటారు. అయినా కొందరికి క్రీమ్స్ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు. అలాంటి వారికోసమే.. ఈ చిట్కాలు. కేవలం ఇంట్లో లభించే వాటితోనే మీ ముఖాన్ని నిగనిగలాడేలా చేసుకోవచ్చు. పచ్చి పాలు ముఖానికి సహజ క్లీనర్ గా పనిచేస్తాయి. ప్రతి రోజూ కొంత దూదిని తీసుకుని దానిని పచ్చిపాలలో ముంచి ముఖానికి రాయాలి.

అలా చేయడం వల్ల ముఖం క్లీన్ గా అవ్వడమే కాకుండా షైన్ గా మారుతుంది. అలాగే తేనెను అప్లై చేసినా.. ముఖం మెరిసిపోతుంది. అయితే ఈ తేనెను ఉడకబెట్టిన తేనెలో కలిపి ముఖంపై రాస్తే ఫలితం ఇంకా తొందరగా వస్తుంది. వీటితో పాటుగా చర్మం టాన్ అయినప్పుడు సహజసిద్దమైన బ్లీచ్ లక్షణాలుండే నిమ్మకాయ ఉపయోగిస్తే.. ముఖంపై ఉండే జిడ్డు కాస్త పోయి ముఖం మేని మెరుపును సంతరించుకుంటుంది.

ఇలా కాకుండా నిమ్మరసానికి చక్కెర కలిపి రాస్తే.. తొందరగా మార్పు కనిపిస్తుంది. ఇకపోతే ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ తో చాలా మంది బాధపడుతుంటారు. వాటిని కేవలం కీరదోసకాయతో మటుమాయం చేయవచ్చు. వాటిని సన్నని స్లైస్ గా కట్ చేసి ముఖంపై పెట్టాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచి.. చల్లటి నీటితో కడిగేయాలి. ఇలాగే ఒక వారం రోజుల పాటు చేస్తే ఫలితం మీకే కనిపిస్తుంది. ఇకపోతే.. వయసుతో సంబంధం లేకుండా మెరవాలంటే వీటిని పాటించడంతో పాటుగా పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటేనే ముఖం సౌంద‌ర్యంగా కాంతివంతంగా మెరుస్తుంది.

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో హృతిక్ రోష‌న్ ఫైట్ !

బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !

క్రేజీ ఫాదర్ అండ్ డాటర్ !

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

భారీగా రేటు పెంచిన బుట్టబొమ్మ !

అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -