Thursday, May 2, 2024
- Advertisement -

హైదరాబాద్ లో జలకన్య ఆకారంలో వింత శిశువు జననం!

- Advertisement -

సాధారణంగా జన్యుపరమైన శిశువులు వింత వింత ఆకారాల్లో జన్మించడం చూస్తుంటాం. అయితే ఈ వింతైన శిశువులు ఎక్కువ కాలం బ్రతికి బట్టకట్టలేదు. అవిభక్త కవలలు కొంత మంది మాత్రం కొంత కాలం జీవిస్తున్నారు. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు.. పశు పక్షాదులకు కూడా జన్మిస్తుంటాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ మహిళ జలకన్య ఆకారంలో వింత శిశువును జన్మించింది.

సంగారెడ్డికి చెందిన తహసిన్ సుల్తానా (20) ఈ నెల 5న ప్రసవరం కోసం హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో కాళ్లు అతుక్కుని జలకన్య రూపంలో బిడ్డ పుట్టింది. ప్రసవం చేసిన వైద్యులు వింత శిశువు విషయాన్ని ఆసుపత్రికి సూపరిండెంట్ నాగమణికి వెల్లడించారు. ఈ వింత శిశువును చూసేందుకు ఆసుపత్రి సిబ్బంది మాత్రమే కాదు అక్కడి జనాలు కూడా వచ్చారు.

అయితే ఆ శిశువు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చనిపోయినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటనపై వైద్యులు స్పందించారు. ఇటువంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయని, జన్యులోపం వల్లే ఇలా జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు.

ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు.. కీలక నిర్ణయం..!

మరో బాలిక కేసు.. మత మార్పిడి చేసి మరి ఆ అబ్బాయ్..!

అరటి తొక్కతో ఇన్ని ప్రయోజనాలున్నాయా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -