Friday, May 3, 2024
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూత

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా గుండె పోటుతో కన్నుమూశారు. కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన నిన్న రాత్రి చాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

బి.ప్రసాదరావు 1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. అ.ని.శా. డీజీపీగా, హైదరాబాద్‌ సీపీ, విశాఖ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ ఎస్పీగా పనిచేసిన ప్రసాదరావు.. ఏసీబీ డీఐజీగా, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్‌గానూ సేవలు అందించారు. ప్రసాదరావు ‘వర్డ్‌ పవర్‌ టు మైండ్‌ పవర్‌’ అనే పుస్తకాన్ని రాశారు.

తను అందించిన సేవలకు గాను 1997లో ఇండియన్ పోలీస్ మెడల్, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను అందుకున్నారు. డీజీపీ వి.దినేశ్ రెడ్డి తర్వాత 30 సెప్టెంబరు 2013లో ఇన్‌చార్జ్ డీజీపీగా ఆయన వ్యవహరించారు.

మరోసారి మంచితనం చాటుకున్న అమితాబచ్చన్!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కన్నుమూత!

అమెరికాలో కాల్పుల మోత.. 12 మంది మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -