Tuesday, April 30, 2024
- Advertisement -

స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన కన్నుగీటు పాప..!

- Advertisement -

ఒక కన్ను గీటితో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియా వారియర్ కి దేశ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు పలు అవకాశాలు కూడా దక్కాయి.తెలుగులో లవర్స్ డే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమెకు నిరాశే ఎదురయింది. ఈ క్రమంలోనే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా కూడా ప్రియ వారియర్ తీవ్ర నిరాశ పరిచింది.

సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియా వారియర్ ఇటు తెలుగు అటు తమిళంలో ఎంత బిజీగా ఉన్నారు. తాజాగా ఒక స్టార్ హీరో కొడుకుతో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసిందని తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమార్ కొడుకు
ధృవ్ విక్రమ్ నటించే తదుపరి చిత్రంలో ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికేధృవ్ విక్రమ్ అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ‘అదిత్య వర్మ’ సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

Also read:మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి సునీత గారు.. లైవ్ లో ఘాటు రిప్లై!

ధృవ్ విక్రమ్ తన తదుపరి చిత్రం మురగదాస్ శిష్యుడు రవికాంత్ దర్శకత్వంలో చేయనున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియా వారియర్ ను అనుకుంటున్నారట. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే కనుక నిజమైతే ప్రియా వారియర్ లక్కీ ఛాన్స్ కొట్టినట్లేనని అభిమానులు భావిస్తున్నారు.

Also read:ఈ టాలీవుడ్ హీరోలు అందరూ అలా కష్టపడే పైకి వచ్చారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -