నందమూరి బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబోలో బాలయ్య 101వ సినిమా రెడ్డిగారు అంటూ కొన్ని గ్యాసిప్‍లు వచ్చాయి. అయితే అది కేవలం గ్యాసిప్ మాత్రంగానే మిగిలిపోయింది. అయితే బాలకృష్ణ 101వ మూవీ మాత్రం దర్శకుడు పూరి జగన్నాథ్ చేతిలోనే పడింది.
తన 101వ చిత్రంను పూరితోనే చేయాలని బాలయ్య ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలకృష్ణ నిర్మాతను కూడా ఫిక్స్ చేశారట. భవ్య క్రియేషన్స్ సంస్థకు బాలయ్య-పూరి కాంబో నిర్మించే అవకాశం దక్కింది. విశేషమేమిటంటే.. ఈ సారి పూరి జగన్నాథ్ టైటిల్స్ టు స్క్రోలింగ్ టైటిల్స్ వరకు స్క్రిప్ట్ విత్ డైలాగ్స్ తో సహా నెరేషన్ ఇవ్వడం విశేషం. ఈ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని.. దాదాపు పూరి జగన్నాధ్ కమ్ బ్యాక్ అనేలా స్క్రిప్ట్ వచ్చిందని అంటున్నారు.
పూరి జగన్నాథ్, బాలయ్య చిత్రం అనగానే మహేష్ కోసం తయారుచేసిన జనగణమన స్క్రిప్ట్ ఇటు వచ్చిందనుకున్నారంతా. కానీ అది కాదని, ఇది వేరే కథని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ ను పూరి చాన్నాళ్ల కిందటే రెడీ చేసి పెట్టుకున్నాడట. ఇక కాస్టింగ్, ఇతరత్రా వ్యవహారాలు వంటి ఫైనల్ డిస్కషన్లు ఈరోజు జరుగుతాయి. ఈ శివరాత్రి సందర్భంగా రేపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Related
