- Advertisement -

అన్నయ్యతో నటించడానికి ఒప్పుకున్న పవర్ స్టార్

- Advertisement -
T Subbarami Reddy Confirms Mega Multi Starrer

కొద్ది రోజుల క్రితం ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త టి. సుబ్బరామిరెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో ఓ మల్టీస్టారర్ సినిమా నిర్మిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఎన్నో ఏళ్ల తమ కల నిజమవుతున్నందుకు మెగా ఫ్యాన్స్ తెగ సంతోష పడ్డారు. అయితే ఈ మల్టీ స్టారర్ సినిమా గురించి సుబ్బరామిరెడ్డి అధికారికంగా చెప్పిన.. ఆ తర్వాత ఈ మెగా మల్టీస్టారర్ మూవీ రూపుదిద్దుకోవడం కష్టమని వార్తలొచ్చాయి.

అందులోను పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యతో సినిమా విషయమై తాననెవరూ సంప్రదించలేదని చెప్పడంతో ఇక మెగా సినిమా లేనట్టేనని అభిమానులు నిరుత్సాహపడిపోయారు. కానీ రీసెంట్ ఆ మీడియాతో మాట్లాడిన సుబ్బరామిరెడ్డి ఈ మల్టీస్టారర్ మూవీ ఉంటుందని బల్లగుద్ది చెప్తున్నారు. అప్పుడెప్పుడో ‘రౌడీ షీటర్’ మూవీ తర్వాత మరో చిత్రం నిర్మిచని ఆయన మళ్లీ తెలుగులో ఒకప్పటిలా మల్టీస్టారర్ సినిమాలు రావాలని ఈ మూవీని నిర్మిస్తున్నట్టు తెలిపారు.

ఇప్పటికే ఈ విషయం గురించి పవన్ తో మాట్లాడానని.. అందుకు పవన్ ఒప్పుకున్నాడని, చిరుని.. పవన్ ని హ్యాండిల్ చేయగల దర్శకుడు త్రివిక్రమ్ అని భావించి మంచి కథను రెడీ చేసే పని ఆయనకు అప్పగించామని, నిర్మాణంలో తనకు సహాయంగా అశ్వినిదత్ ముందుకొచ్చారని, అలానే ప్రస్తుతం చిరు, పవన్ ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అన్నారు. ఈ ప్రకటన మళ్లీ అభిమానుల్లో పాత ఉత్సాహాన్ని నింపింది.

Related

  1. మెగాస్టార్ రికార్డును బద్దలు కొట్టిన పవర్ స్టార్!
  2. పవర్ స్టార్ కు సూపర్ స్టార్ సలహా ఇచ్చాడు!
  3. అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ ఘోరమైన కామెంట్స్!
  4. ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్.. ఎలా అంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -