మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికకు జొన్నలగడ్డ చైతన్యతో గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో అంగరంగ వైభవంగా వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక భర్త చైతన్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.అలాగే వృత్తిపరంగానూ నటిగా రాణించాలని భావిస్తోందట. పెళ్లి తర్వాత ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిహారిక ఇటీవలె ఓ సినిమాలో నటిస్తోందని సమాచారం.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో సెలబ్రిటీలంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. స్టే హోమ్, స్టే సేఫ్ అనే నినాదమిస్తూ ఏ ఒక్కరూ గడపదాటి బయటకు రావడంలేదు. ఈ నేపథ్యంలోనే మెగా డాటర్ నిహారిక ఈ విరామ సమయాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోందట. భర్తతో ఇంట్లోనే పూర్తి సమయాన్ని గడుపుతూ ఫన్నీగా సోషల్ మీడియాలో తన కెరియర్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకొని అందరూ కరోనా జాగ్రత్తలు పాటించి ఇంట్లోనే ఉండాలని సూచిస్తోంది.
Also read:యాపిల్ యూజర్స్ కు ఈ యాప్ గురించి తెలుసా?
మెగా డాటర్ నిహారిక కొణిదెల తెలుగులో హీరోయిన్ గా ఇప్పటి వరకు “ఒక మనసు”, “హ్యాపీ వెడ్డింగ్” , “సూర్యకాంతం”వంటి సినిమాల్లో అద్భుతంగా నటించినప్పటికీ ఆశించినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి.కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు మాత్రం భాగానే అలరిస్తున్నాయి. ఇక ఇటీవల పెళ్లి చేసుకున్న నిహారిక సినిమాలకు కాస్తా విరామం ఇచ్చింది.