నేను ప్రజలకు సేవ చెయ్యడం ఒక కల.. ఆర్జీవీ!

- Advertisement -

ఇండస్ట్రీలో వివాదాస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా పరిణామాలపైన, వివాదాస్పద ఘటనల పైన సినిమాలు చేస్తూ, ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం అతని ప్రత్యేకత.ఎప్పుడు ఎవరి మీద సినిమా తీస్తాడో, ఎప్పుడు ఎవరి మీద కౌంటర్లు వేస్తాడో ఎవరికీ తెలియదు.ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కామెంట్లకు తెరతీస్తున్నారు.

తాజాగా ఇంటర్వ్యూలో ఓ విలేఖరి రాంగోపాల్ వర్మ ను మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించగా, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని, ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నవాళ్లే రాజకీయాల్లోకి వస్తారని,ప్రజలకు సేవ చేయాలనే కోరికే తనకు లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.అలాగే తనకు తాను సేవ చేసుకోవడానికి సమయం లేదని, ఇక ప్రజలకు ఏం సేవ చేస్తాను అని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Also read:త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా… త్వరలోనే ప్రకటన?

ఈ క్రమంలోనే వర్మ త్వరలో ప్రారంభించనున్న స్పార్క్‌ ఓటీటీ గురించి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఓటీటీ ప్రాముఖ్యత చాలా పెరుగుతుందని. మరి కొంతమంది సన్నిహితులతో కలిసి స్పార్క్‌ ఓటీటీని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని. ఈ ప్లాట్ ఫామ్ పై అన్ని భాషల చిత్రాలను అందుబాటులోకి . తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. అలాగే వర్మ తాజాగా నిర్మిస్తున్న దావూద్‌ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘డీ కంపెనీ’ సినిమా కూడా స్పార్క్‌ ఓటీటీలో విడుదలవుతుందని చెప్పుకొచ్చాడు.

Also read:14 ఏళ్లకే ఆ పని చేసిన సురేఖ వాణి.. ఏది అంటే?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -