Friday, April 19, 2024
- Advertisement -

నా భర్తను చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. రఘురామరాజు భార్య సంచలన కామెంట్స్

- Advertisement -

ఏపి సీఐడీ అరెస్టు చేసిన ఎంపీ రఘురామరాజును గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు. రఘురామరాజుకు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందించాలని కోర్టు ఆదేశించినా సీఐడీ పోలీసులు పట్టించుకోలేదు. గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రఘురామరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తాజాగా కోర్టు ఆదేశాలను ధిక్కరించి జైలుకు తరలించారు.సీఐడి కోర్టు ఒక మాదిరి,హైకోర్టు మరో తరహాలో తీర్పు ఇవ్వడంతో పోలీసులు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక జిల్లా జైలుకు తరలించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. జగన్ సర్కార్‌పై ఎంపీ రఘురామ రాజు సతీమణి రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తన భర్తను బాగా కొట్టారని ఆరోపించారు. కోర్టు నిబంధనలను పట్టించుకోకుండా జైలుకు తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తను జైల్లో చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పటికే కడపకు చెందిన వ్యక్తులను జైలుకు పక్కా ప్రణాళికతో ముందుగానే తరలించారని వివరించారు.

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రఘురామను బెదిరించారని, ఆయన అందుకు అంగీకరించకపోవడంతో బాగా కొట్టారని తెలిపారు. ఆయన అరెస్టయిన సమయంలో బాగా నడుచుకుంటూ వెళ్లారని, అలాంటిది ఒక్కరోజులో పరిస్థితి మారిపోయిందని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామరాజు విషయంలో ఏం జరుగుతుందో తనకేం అర్థం కావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే.. అక్రమ అరెస్టులు చేస్తారా.. అని మండిపడ్డారు.

వర్షంలో తెగ ఎంజాయ్ చేసిన అనసూయ!

హీరోయిన్ ని టార్చర్ చేసిన లెక్చరర్.. ఆ గుట్టు అంతా అలా?

మిస్డ్ కాల్ ఇవ్వండి.. ఆక్సిజన్ పంపిస్తానంటున్న సోనూ సూద్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -