శ్రీహరి భార్య కి భయపడిన చిరంజీవి

disco shanti gives shocks to chiranjeevi and ragavendra rao

రియల్‌ స్టార్‌ శ్రీహరి భార్య డిస్కో శాంతి మెగాస్టార్ చిరుని భయపెట్టడం ఏంటాబ్బా అని ఆలోచిస్తున్నారా.. అసలు విషయం ఇప్పటిది కాదులేండి.. శ్రీహరికి భార్య కాకముందు డిస్కోశాంతి సినిమాల్లో హీరోయిన్‌గా, ఐటెం సాంగ్స్‌ చేసేది. చిరంజీవితో పలు సినిమాలో ఈమె నటించింది. అలాగే ప్రత్యేక పాటలు చేసింది.

పలువురు హీరోలతో ఐటెం సాంగ్స్‌ చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న డిస్కో శాంతి కొన్ని విషయాల్లో చాలా సీరియస్‌ అయ్యేది. ముఖ్యంగా తనతో చెడుగా ప్రవర్తించిన వారితో డిస్కో శాంతి చాలా సీరియస్‌గా వ్యవహరించేది. చిరంజీవి నటించిన ‘ఘరాన మొగుడు’ సినిమాలో డిస్కో శాంతి బంగారు కోడి పెట్ట ఐటెం సాంగ్‌ చేసింది. ఆ సాంగ్‌ను వైజాగ్‌లో చిత్రీకరిస్తున్న టైంలో అభిమానులు భారీ స్థాయిలో అక్కడ గుమ్మిగూడారు.

చిరంజీవితో షాట్‌ పూర్తి చేసిన డిస్కో శాంతి నడుచుకుంటూ వస్తుండగా, కొందరు ఆకతాయిలు ఆమె వద్దకు వచ్చారట. అందులో ఒకడు ఆమె నడుముపై చేయి వేశాడట. దాంతో ఆ చేయి పట్టుకుని అతడిని చితక బాదింది. అక్కడే ఉన్న చిరంజీవి మరియు దర్శకుడు రాఘవేంద్ర రావు ఆమెను చూసి షాక్‌ అయ్యారట. ఆ సమయంలో డిస్కో శాంతిని చూసి చిరంజీవి భయపడ్డాడట. ఇంత కోపం ఈమెకు ఉందా అని అనుకున్నాడట.

{youtube}a6tRASTVHwE{/youtube} 

Related

  1. నాగ్ ని భర్తీ చేయలేకపోయిన చిరు
  2. పవన్ నా బ్రదర్.. నా బ్లడ్ బ్రదర్.. సూపర్ కౌంటర్ ఇచ్చిన చిరు!
  3. పవన్ కి ఫోన్ చేసిన చిరు.. ఎందుకంటే..?
  4. చిరు దెబ్బకి బయపడిన వర్మ.. అందుకే ఈ ట్వీట్స్..?