- Advertisement -

తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి ప్రేమ!

- Advertisement -

ఈ మద్య సోషల్ మీడియాలో సెలబ్రెటీల విషయంలో ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతున్నాయి. కొన్ని సార్లు బతికి ఉన్నవారు చనిపోయినట్టు వచ్చే వార్తలు చూస్తూనే ఉన్నాం.. తర్వాత ఆ సెలబ్రెటి తాము బతికే ఉన్నాం అని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటున్నాయి. తాజాగా సీనియర్‌ నటి ప్రేమ రెండో పెళ్లికి రెడీ అయిందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. త్వరలోనే ఆమె మూడు ముళ్లు వేయించుకోనుందంటూ సోషల్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

నటి ప్రేమ 2006లో వ్యాపారవేత్త జీవన్‌ అప్పచును పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ మధ్య ఈమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు వార్తలు రాగా, అందులో నిజం లేదని స్పష్టం చేసింది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించి న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ద‌క్కించుకున్న న‌టి ప్రేమ.

త్వ‌ర‌లోనే ఆమె రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఈ నేప‌థ్యంలో ప్రేమ ఆ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని తేల్చి చెప్పింది. అలాగే తన ఆరోగ్యం మీద వస్తున్న వదంతులను నమ్మవద్దని, తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొంది.

కలుషిత నీరు తాగి నలుగురు మృతి..

క్రాక్ టీమ్ ఇచ్చిన సర్ప్రైజ్ చూశారా.. ఎంత బాగుందో?

ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు అంటూ నటి ఫైర్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -