Saturday, May 4, 2024
- Advertisement -

కలుషిత నీరు తాగి నలుగురు మృతి..

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ తో మానవ సంబంధాలు పూర్తిగా నశించిపోతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో కలుషితమైన నీరు త్రాగి నలుగురు మృతి చెందారు. 72 మంది ఆసుపత్రి పాలయ్యారు. పలువురు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషాద సంఘటన గుజరాత్‌లోని సూరత్‌ పరిధిలోని కఠోర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సూరత్‌ మున్సిపల్‌ అధికారులు విచారణ చేపట్టారు.

అధికారుల విచారణలో తాగునీటి పైప్‌లైన్‌లో డ్రైనేజీ నీరు కలిసిందనీ.. ఆ నీరు తాగిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కలుషిత నీరు ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం జరిగిన ఈ విషాదరకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దవారితో సహా చిన్నారులు కూడా అస్వస్థతకు గురైనవారిలో ఉన్నారు.

చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారు గెమల్‌ వాసవ అనే 45 ఏళ్ల వ్యక్తి, హరీశ్‌ రాథోడ్‌ (42), మోహన్‌ రాథోడ్‌ (70) విజయ్‌ సోలంకి (38). 250 నివాస ప్రాంతాలకు ఈ కలుషిత నీరు సరఫరా అయ్యిందని అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్ని చేపట్టారు. డ్రైనేజీ నీటి పైపును తొలగించి స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -