Sunday, April 28, 2024
- Advertisement -

క్రాక్ టీమ్ ఇచ్చిన సర్ప్రైజ్ చూశారా.. ఎంత బాగుందో?

- Advertisement -

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ “క్రాక్”. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను షేక్ చేస్తూ భారీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా అద్భుతంగా నటించింది. ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమాలో పోతరాజు వీర శంకర్‌గా పోలీసు పాత్రలో తన నటనా విశ్వరూపాన్ని చూపించారు.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విడుదలై అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. తర్వాత ఫిబ్రవరి 5న “క్రాక్ “సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Also read:వెబ్ సిరీస్ లలో స్టార్ హీరో.. ఎవరంటే?

తాజాగా ఆహా సంస్థ‌ బెస్ట్ ఆఫ్ క్రాక్ పేరిట ఓ వీడియోను ఆహాలో విడుద‌ల విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఇక ఈ వీడియోలో హీరో, విలన్ మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు, రవితేజ మాస్‌ డైలాగులతో పాటు హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ తో వీడియోను అద్భుతంగా క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ బెస్ట్ ఆఫ్ క్రాక్ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also read:ఆ దర్శకుడి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కర్ణన్ రీమేక్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -