Thursday, May 9, 2024
- Advertisement -

వారి వల్ల నాకు అవకాశాలు తగ్గలేదు: నటి అంజలి

- Advertisement -

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో తెలుగింటి సీతగా ఎంతోమంది మనసులను దోచుకున్న అంజలి ఆ తరువాత పలు సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో కొద్దిరోజుల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఈ క్రమంలోనే తన శరీరం పై దృష్టి పెట్టిన ఈ సీతమ్మ ఎంతో నాజూగ్గా తయారయ్యి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అంజలి పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ద్వారా మరోసారి ఎంట్రీ ఇచ్చారు.

వకీల్ సాబ్ సినిమాలో నూటికి నూరుశాతం అంజలి తన పాత్రకు న్యాయం చేసింది. గత కొద్ది రోజుల నుంచి ఎలాంటి హిట్ లేక సతమతమవుతున్న ఈమెకు వకీల్ సాబ్ సినిమా ద్వారా మంచి విజయం అందడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Also read:పుష్ప సినిమాలో ఒకప్పటి లవర్ బాయ్.. ఎవరంటే?

చాలా మంది కొత్త హీరోయిన్స్ రావడంతో పాత వారికి అవకాశాలు రావు అంటారు. కానీ కొత్త వారి వల్ల తనకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదని అంజలి పేర్కొన్నారు. ఏ పాత్రలో ఎవరు నటిస్తే సరిపోతుందో వారిని దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకుంటారని ఈమె తెలిపారు. తన విషయానికి వస్తే తన వరకు వచ్చిన పాత్రకి నూరు శాతం న్యాయం చేస్తానని ఈ సందర్భంగా నటి అంజలి పేర్కొన్నారు.

Also read:హాలీవుడ్ సినిమా తీయనున్న రాజమౌళి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -