పుష్ప సినిమాలో ఒకప్పటి లవర్ బాయ్.. ఎవరంటే?

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’ ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో మాస్ లుక్ లో కనిపించనున్నాడు ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీలో ప్రతి పాత్ర పట్ల స్పెషల్ కేర్ తీసుకొని ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెలుగు,కన్నడ,తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నాడు.

తాజాగా పుష్ప మూవీ కోసం టాలీవుడ్లో ఒకప్పటి క్రేజీ యువ హీరో తరుణ్ ను సంప్రదించినట్లు సమాచారం. లవర్‌ బాయ్‌గా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ కొన్ని కారణాల వల్ల అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. పుష్ప మూవీలో మలయాళ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈవిలన్ పాత్రకు హీరో తరుణ్ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వటానికి చిత్ర యూనిట్ తరుణ్‌తో చర్చలు జరుపుతున్నారట.దీంతో మళ్లీ హీరో తరుణ్ వాయిస్ వెండితెరపై వినపడనుందీ. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

- Advertisement -

Also read:ఆ విషయంలో నన్ను క్షమించండి అంటున్న కొత్త పెళ్ళికూతురు..!

మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలో అల్లు అర్జున్ సరసన బ్యూటీ క్వీన్ రస్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్, అనసూయ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ కార్యక్రమాలు నిలిచిన విషయం తెలిసిందే.

Also read:పొట్టి నిక్కర్ లో.. హల్ చల్ చేస్తున్న అర్జున్ రెడ్డి బామ!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -