Tuesday, April 30, 2024
- Advertisement -

బన్నీ అస్సలు తగ్గేటట్టు లేడుగా..!

- Advertisement -

ప్రస్తుతం తెలుగు హీరోలంతా తమ మార్కెట్ ను పాన్​ ఇండియా లెవెల్​కు విస్తరించుకొనేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ప్రభాస్​ పాన్​ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్​ కావడంతో.. మెగా హీరోలు సైతం ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. అల్లు అర్జున్​.. సుకుమార్​తో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పుష్ప’ పాన్​ ఇండియా మూవీగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్​కు తెలుగుతో పాటు మలయాళంలోనూ ఇప్పటికే మంచి మార్కెట్ ఉంది.

ఇక తమిళ, హిందీ భాషల్లోనూ సత్తా చాటితే అతడి పాన్​ఇండియా స్టార్​గా ఎదగడం ఖాయం. మరో హీరో రామ్​ చరణ్​, ఎన్టీఆర్ లు సైతం పాన్​ ఇండియా స్టార్​లు గా ఎదగబోతున్నారు. ఆర్​ఆర్​ఆర్​ విడుదలైతే వారి మార్కెట్​ విస్తరించడం ఖాయం. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎన్​ శంకర్​తో చరణ్ ఓ భారీ ప్రాజెక్ట్​ చేయబోతున్నాడు. అయితే అల్లు అర్జున్​ పుష్ప2 కంటే ముందే మరో భారీ ప్రాజెక్ట్​ ఐకాన్​కు కమిట్​ అయ్యాడు.

ఈ మూవీని వకీల్​ సాబ్​ డైరెక్టర్​ వేణు శ్రీరామ్​ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. అదేమిటంటే.. ఐకాన్​కు మ్యూజిక్​ డైరెక్టర్​గా థమన్​ సెలక్ట్​ అయ్యాడట. థమన్​ గతంలో మ్యూజిక్​ అందించిన అల వైకుంఠపురములో భారీ మ్యూజికల్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పుష్పకు దేవీ శ్రీ ప్రసాద్​ మ్యూజిక్​ అందిస్తున్నాడు. ఇప్పుడు మళ్లీ థమన్​కు చాన్స్​ దక్కింది.

Also Read

నెటిజన్ల రేటింగ్స్​.. మాస్టర్​ టాప్.. వకీల్ సాబ్​, క్రాక్ జోరు

లైట్స్.. కెమెరా.. యాక్షన్..!

రాశి ఖన్నా జెట్ స్పీడ్.. ఒకేసారి ఆరు సినిమాల్లో ఛాన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -