Saturday, April 27, 2024
- Advertisement -

నెటిజన్ల రేటింగ్స్​.. మాస్టర్​ టాప్.. వకీల్ సాబ్​, క్రాక్ జోరు

- Advertisement -

థియేటర్లలో హిట్​ అయిన సినిమాలు టీవీ జనాలకు నచ్చవు. థియేటర్లలో ప్లాప్​ అయినా సినిమాలు టీవీ జనాలకు ఎంతో నచ్చుతాయి. ఇందుకు ఉదాహరణలు అనేకం.. ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది. అక్కడ ప్రేక్షకుల అభిరుచులు వేరు. థియేటర్లకు సహజంగా అన్ని వర్గాల ప్రేక్షకులు వెళ్తుంటారు. కానీ ఓటీటీ వేదికల్లో కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రమే ఉంటారు. అందుకే థియేటర్​ ప్రేక్షకుల అభిరుచికి.. ఓటీటీ ప్రేక్షకుల అభిరుచికి చాలా తేడా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు సినిమాలు తెరకెక్కిస్తుంటారు.

కరోనా ఫస్ట్​వేవ్​ అనంతరం భారీ అంచనాలతో విడుదలైన ఇళయ దళపతి విజయ్ మాస్టర్​ సినిమాకు భారీగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే రివ్యూలు మాత్రం కొంత నెగిటివ్​గానే వచ్చాయి. లోకేష్ కనగరాజ్ సినిమా అంటే ఎంతో ఊహించుకున్నారు. కానీ అతడు కూడా హీరో ఇమేజ్​కు అనుగుణంగా మూవీ తెరకెక్కించే సరికి కొంతమంది అసంతృప్తికి గురయ్యారు. మాస్టర్​ సినిమా తమిళ జనాలకు అలాగే నెటిజన్లకు తెగ నచ్చేసింది.

చిత్రాల రేటింగ్​ విషయంలో ఐఎండీబీ(ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌) ను ఎక్కువ మంది విశ్వసిస్తుంటారు. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన జాబితాలో మాస్టర్​ సినిమా టాప్​లో నిలిచింది. యూజర్ల అభిప్రాయం ప్రకారమే.. ఐఎండీబీ రేటింగ్స్​ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ సంస్థ 2021లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన టాప్‌-10 చిత్రాలు, వెబ్‌సిరీస్ ల జాబితాను విడుదల చేసింది. అందులో విజయ్ నటించిన మాస్టర్​ టాప్​లో నిలిచింది.

ఆస్పిర్టన్స్‌ వెబ్‌సిరీస్, ది వైట్‌ టైగర్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నవంబర్‌ స్టోరీ- ఐదో స్థానంలో నిల‌వ‌గా, ధనుష్‌ చిత్రం కర్ణన్‌- 6, పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ చిత్రం-7, క్రాక్ సినిమా 9వ స్థానం దక్కించుకుంది. టాలీవుడ్ నుంచి వకీల్ సాబ్, క్రాక్ మాత్రమే టాప్ టెన్ లో స్థానం సంపాదించాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి.

Also Read

వకీల్ సాబ్ మళ్లీ తెరపైకి వచ్చేస్తున్నాడు..!

లైట్స్.. కెమెరా.. యాక్షన్..!

రాశి ఖన్నా జెట్ స్పీడ్.. ఒకేసారి ఆరు సినిమాల్లో ఛాన్స్..!

థియేటర్ లో సినిమా చూడాలని ఉందా? అయితే అక్కడికి వెళ్లండి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -