Thursday, May 2, 2024
- Advertisement -

లైట్స్.. కెమెరా.. యాక్షన్..!

- Advertisement -

దర్శకుల నోట నుంచి వచ్చే ఈ మాట విని ఎన్ని నెలలైందో. ఈ ఏడాది ఏప్రిల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి సినిమా షూటింగులు అన్ని రద్దయ్యాయి. ఇప్పటికే తుది దశలో ఉన్న సినిమాలు, కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సినిమాల చిత్రీకరణ నిలిచిపోయింది. సుమారు మూడు నెలల పాటు షూటింగ్ లు బంద్ కావడంతో సినీ ఇండస్ట్రీకి చెందిన పలు విభాగాల కార్మికులు ఉపాధి కోల్పోయారు. అకస్మాత్తుగా షూటింగ్ లు ఆగిపోవడంతో నిర్మాతలు కూడా నష్టాలపాలయ్యారు.

అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో మళ్లీ షూటింగ్ లు మెల్ల మెల్లగా మొదలవుతున్నాయి. కమెడియన్ సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న క్యాలీఫ్లవర్ సినిమా ఐదు రోజుల కిందటే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మొదలైంది. నితిన్ హీరోగా నటిస్తున్న అంధాదూన్ రీమేక్ మాస్ట్రో కూడా ఇవాళే తిరిగి చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమాలతో పాటు పలు చిత్రాలు ఇదే నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నాయి.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న ఎఫ్ 3 మరో వారం రోజుల్లో షూటింగ్ మొదలు కానుంది. ఇందుకు సంబంధించి సారధి స్టూడియోలో వేసిన సెట్స్ లో షూటింగ్ జరపనున్నట్లు సమాచారం. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, కొన్ని సీన్లు రీ షూట్ చేయాల్సి ఉంది. ఈ నెలాఖరులోనే ప్రభాస్ పై ఆ సీన్లు చిత్రీకరించనున్నారు. సలార్ షూట్ కూడా జూలై నుంచి ప్రారంభం కానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ కు సిద్ధమయ్యారు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కూడా ఇదే నెలలో మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య షూటింగ్ ఇప్పటికే చాలా డిలే అయింది. అందుకోసం సాధ్యమైనంత తొందరగా తిరిగి షూటింగ్ ప్రారంభించాలని చిరంజీవి ఒక నిర్ణయానికి వచ్చినట్టు టాక్. అల్లు అర్జున్- సుకుమార్ పుష్ప, బాలయ్య- బోయపాటి అఖండ సినిమాలు కూడా అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్. చాలా రోజుల తర్వాత షూటింగ్ లు మొదలవుతుండడంతో సినిమా కళకళలాడనుంది.

Also Read

సౌత్​లో బన్నీ కొత్త రికార్డ్​.. విజయ్​ ని కూడా దాటేశాడే..!

థియేటర్ లో సినిమా చూడాలని ఉందా? అయితే అక్కడికి వెళ్లండి?

సీతగా ఆమెనా.. అస్సలు ఒప్పుకోం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -