Saturday, May 4, 2024
- Advertisement -

మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్.. ఈ సారి కూడా హిట్ పక్కానా..!

- Advertisement -

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ముందుగా శేఖర్ కమ్ముల ఈ కథను హీరో మహేష్ బాబుకు వినిపించాడు. ఆయన తిరస్కరించడంతో రామ్ చరణ్ ను కలిసి కథ వినిపించాడు. అయితే రామ్ చరణ్ కు ఈ కథ బాగా నచ్చింది. అయితే ఇది తనకు సూట్ అవదని వరుణ్ తేజ్ కి సూటవుతుందని సజెస్ట్ చేశాడు. రామ్ చరణ్ కోరుకున్నట్టుగానే శేఖర్ కమ్ముల వరుణ్ ను కలవడం, ఆయనకు ఆ కథ నచ్చి సినిమా చేయడం, అది సూపర్ హిట్ గా నిలవడం జరిగింది.

ఇప్పుడు మరోసారి వరుణ్ తేజ్ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడని సమాచారం. నితిన్ కి భీష్మ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల ఇటీవల రామ్ చరణ్ ని కలిసి ఓ కథ వినిపించాడట. అయితే ఆయనకు ఆ కథ నచ్చినా తనకు సూట్ అవదని సున్నితంగా తిరస్కరించాడట. ఇప్పుడు అదే కథతో వెంకీ వరుణ్ తేజ్ ను కలిసి వినిపించగా వరుణ్ కు ఆ కథ బాగా నచ్చినట్లు టాక్. దీంతో వెంకీ కుడుముల వరుణ్ ఇమేజ్ కు అనుగుణంగా కథను మార్చే పనిలో పడ్డాడట.

Also Read: రవితేజ రెమ్యునరేషన్​ పెంచేశాడా?

ప్రస్తుతం వరుణ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు గని అనే టైటిల్ పెట్టారు. దీంతోపాటు వరుణ్ తేజ్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవగానే వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. చరణ్ తిరస్కరించిన ఫిదా సూపర్ హిట్ అయినట్లుగానే ఈ సినిమా కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

Also Read: బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడితో తారక్​ మూవీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -