వరస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్.. తాజాగా నటిస్తున్న సినిమా డీజే – దువ్వాడ జగన్నాధం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్.. యూట్యూలో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాల్లో అత్యధిక వ్యూస్ సంపాదించిన లిస్ట్ లో మూడో స్థానంలో ఈ డీజే టీజర్ నిలిచింది. ఇప్పుడు టీజర్ వ్యూస్ 10మిలియన్లు.. అంటే అక్షరాలా కోటి వ్యూస్ దాటిపోయి రికార్డ్ సృష్టించేసింది.
ఈ నెపథ్యంలో బన్నీ స్పెషల్ ట్వీట్ పెట్టాడు. ‘కోటి వ్యూస్ అందించిన ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలుగు సినిమాల్లో అత్యధిక వ్యూస్ ఇచ్చారు. మీ అందరి ప్రీమకు మరోసారి థ్యాంక్యూ’ అంటూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. ఈ టీజర్ కు ఇన్ని వ్యూస్ దక్కడంలో పవన్ ఫ్యాన్స్ కీలక పాత్ర పోషించారనే టాక్ ముందు నుంచి ఉంది.
పని కట్టుకుని మరీ డిజ్ లైక్స్ కొట్టారంటారు కూడా. అందుకే డీజే టీజర్ కు లైక్స్ 1.78 లక్షలు ఉంటే.. డిజ్ లైక్స్ సంఖ్య 1.63 లక్షలు వచ్చాయి. డిజ్ లైక్ కొట్టడానికి అయినా.. డీజే టీజర్ ను వీక్షించారు పవన్ ఫ్యాన్స్. ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పడంలో.. పవన్ ఫ్యాన్స్ ని బన్నీ మిక్స్ చేశాడని అంటున్నారు సినీ జనాలు. మరోవైపు.. ఇప్పటికే 85శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న డీజే ను సమ్మర్ లో.. మే 19న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
{youtube}YA48dqwrunE{/youtube}
{youtube}VosTwr26pmM{/youtube}
Related
