ఫొటో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అంజలికి మొదట్లో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తమిళ చిత్రం షాపింగ్ మాల్ లో నటించింది. ఆ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమెకు తమిళ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఒక దశలో అక్కడ ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తమిళ అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
తమిళంలో ఆమె చేసిన జర్నీ ఆమె కెరీర్ లోనే మైలురాయి. ఆ సినిమా ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. ఆ సినిమా తెలుగులో డబ్ అయి సూపర్ సక్సెస్ అయ్యింది. వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో అంజలి సీతగా ఆకట్టుకుంది. ఈ మూవీ విజయం సాధించడంతో వరుసగా తెలుగులో ఛాన్స్ లు వచ్చాయి. బలుపు, గీతాంజలి, డిక్టేటర్, మసాలా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది అంజలి.అయితే ఇటీవల విడుదలైన నిశ్శబ్దం, వకీల్ సాబ్ లో అంజలి చేసిన పాత్రలకు మంచి పేరు తీసుకొచ్చింది.
Also Read: బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడితో తారక్ మూవీ..!
ఇదిలా ఉంటే ఆమె ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్ మార్కుకు చేరుకున్నది. ట్విట్టర్లో సమంతకు 8.8 మిలియన్లు, శృతి హాసన్‌కు 7.8 మిలియన్లు, త్రిషకు 5.3 మిలియన్లు, తమన్నాకు 5 మిలియన్లు, హన్సికాకు 5 మిలియన్లు, కాజల్ అగర్వాల్‌కు 4.8 మిలియన్లు, కీర్తి సురేష్‌కు 3.9 మిలియన్లు, ఐశ్వర్యా రాజేష్‌కు 2.1 మిలియన్లు, అమలాపాల్‌కు 2.1 మిలియన్లు, సాయి పల్లవికి 1.9 మిలియన్లు, రాయ్‌లక్ష్మికి 1.8 మిలియన్లు, రాశిఖన్నాకు 1.3 మిలియన్ల చొప్పున ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం అంజలి కూడా 1 మిలియన్ ఫాలోవర్స్ సరసన చేరింది.
Also Read: రాశి ఖన్నా జెట్ స్పీడ్.. ఒకేసారి ఆరు సినిమాల్లో ఛాన్స్..!