శేఖర్ కమ్ముల సినిమాల్లో ఎంతో కొత్తదనం ఉంటుంది. మాస్ మసాలా, భారీఫైట్లు, స్పెషల్ సాంగ్స్ ఇటువంటి హంగులు ఏమీ ఆయన చిత్రాల్లో ఉండవు. ఆయనది ఓ స్పెషల్ జోనర్. ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆయనకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. అయితే సాయిపల్లవితో ఇప్పటికే ఫిదా సినిమా చేసిన శేఖర్ కమ్ముల. ప్రస్తుతం లవ్‌స్టోరీ తెరకెక్కిస్తున్నాడు. వీరి కాంబినేషన్లో మరో చిత్రం కూడా రాబోతున్నదట.
ఆ సినిమాలో హీరోగా ధనుష్ నటిస్తున్నాడు. ఇప్పటికే తమిళనాట ధనుష్- సాయిపల్లవి జంట హిట్ పెయిర్‌గా నిలించింది. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వీరిద్దరూ మరోసారి జంటగా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నది. ధనుష్ తొలిసారిగా తెలుగులో నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడం గమనార్హం.ధనుష్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. రఘువరన్ బీటెక్ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. దీంతో ధనుష్ తెలుగులో స్ట్రెయిట్‌గా ఓ సినిమాలో నటించబోతున్నాడు.
Also Read: తెలుగు హీరోలు ‘నో’ చెప్పినా.. తమిళ హీరో ‘ఎస్’ చెప్పి ఆ డైరెక్టర్ సత్తా ఏంటో గుర్తించాడు..!
ధనుష్ – సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన మారి -2 సూపర్ హిట్ అయ్యింది. ఇక రౌడీ బేబీ సాంగ్‌కు ఏ రేంజ్లో ఆదరణ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు శేఖర్ కమ్ముల .. సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ఫిదా సూపర్ హిట్ కొట్టింది. ఇక లవ్‌స్టోరీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సారంగధరియా సాంగ్ దూసుకుపోతున్నది. దీంతో వీరి కాంబినేషన్ మరోసారి హాట్రిక్ కొడుతుండటం గమనార్హం.
Also Read: మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్.. ఈ సారి కూడా హిట్ పక్కానా..!