Thursday, April 25, 2024
- Advertisement -

శేఖర్​ కమ్ముల సినిమాలో మరోసారి ఛాన్స్ కొట్టిన సాయిపల్లవి..!

- Advertisement -

శేఖర్​ కమ్ముల సినిమాల్లో ఎంతో కొత్తదనం ఉంటుంది. మాస్​ మసాలా, భారీఫైట్లు, స్పెషల్ సాంగ్స్​ ఇటువంటి హంగులు ఏమీ ఆయన చిత్రాల్లో ఉండవు. ఆయనది ఓ స్పెషల్ జోనర్​. ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆయనకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. అయితే సాయిపల్లవితో ఇప్పటికే ఫిదా సినిమా చేసిన శేఖర్​ కమ్ముల. ప్రస్తుతం లవ్​స్టోరీ తెరకెక్కిస్తున్నాడు. వీరి కాంబినేషన్​లో మరో చిత్రం కూడా రాబోతున్నదట.

ఆ సినిమాలో హీరోగా ధనుష్​ నటిస్తున్నాడు. ఇప్పటికే తమిళనాట ధనుష్- సాయిపల్లవి జంట హిట్​ పెయిర్​గా నిలించింది. ఈ క్రమంలో శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో వీరిద్దరూ మరోసారి జంటగా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నది. ధనుష్​ తొలిసారిగా తెలుగులో నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడం గమనార్హం.ధనుష్​కు తెలుగులో మంచి మార్కెట్​ ఉంది. రఘువరన్​ బీటెక్​ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. దీంతో ధనుష్​ తెలుగులో స్ట్రెయిట్​గా ఓ సినిమాలో నటించబోతున్నాడు.

Also Read: తెలుగు హీరోలు ‘నో’ చెప్పినా.. తమిళ హీరో ‘ఎస్’ చెప్పి ఆ డైరెక్టర్ సత్తా ఏంటో గుర్తించాడు..!

ధనుష్​ – సాయిపల్లవి కాంబినేషన్​లో వచ్చిన మారి -2 సూపర్​ హిట్ అయ్యింది. ఇక రౌడీ బేబీ సాంగ్​కు ఏ రేంజ్​లో ఆదరణ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు శేఖర్​ కమ్ముల .. సాయిపల్లవి కాంబినేషన్​లో తెరకెక్కిన ఫిదా సూపర్​ హిట్ కొట్టింది. ఇక లవ్​స్టోరీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సారంగధరియా సాంగ్ దూసుకుపోతున్నది. దీంతో వీరి కాంబినేషన్​ మరోసారి హాట్రిక్​ కొడుతుండటం గమనార్హం.

Also Read: మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్.. ఈ సారి కూడా హిట్ పక్కానా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -