చిరంజీవి లేటెస్ట్ లుక్ చూశారా.. ఎంత బాగుందో?

- Advertisement -

ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ప్రజల సమస్యలపై స్పందిస్తూ తన సేవా గుణాన్ని చాటుకుంటున్నాడు టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి.ప్రస్తుతం కరోనా రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.వారి ప్రాణాలకు రక్షణ కల్పించడానికి తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకు ఒక ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి ఎంతోమందికి ప్రాణ దానం చేసి రియల్ హీరో గా నిలిచాడు.

ప్రస్తుతం చిరంజీవి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకోనీ సందడి చేస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ త‌న‌కు సంబంధించిన గ్రిప్పింగ్ లుక్ ఒక‌టి సోషల్ మీడియాలో విడుద‌లచేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.ఈకొత్త లుక్ ఏ సినిమాకు సంబంధించినదో అర్థం కాక అభిమానుల్లో గందరగోళం నెలకొంది.ఇక తాజాగా నీలకంఠపురం దేవాలయాలు తెరిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియో ను అభిమానులతో పంచుకున్నాడు.

Also read:ఒక్కటవుతున్న రష్మీ, అనసూయ.. క్రేజి ప్రాజెక్టుకు సై!

కొంత కాలం పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్న మెగాస్టార్ తిరిగి “ఖైదీ నెంబర్ 150″ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత మెగా స్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన” సైరా నరసింహారెడ్డి “మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రస్తుతం చిరంజీవి 152 వ సినిమా “ఆచార్య” కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత లూసిఫ‌ర్, వేదాళం రీమేక్ సినిమాల్లో న‌టించ‌నున్నాడు.

Also read:మళ్ళీ టాలీవుడ్ కు రానున్న అలియా భట్..?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -