- Advertisement -

దూసుకుపోతున్న మెగా మేనల్లుడు.. మొత్తం నాలుగు సినిమాలు చేతిలో..!

- Advertisement -

తన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. వచ్చిరాగానే బంపర్ హిట్ కొట్టాడు. తన తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేరాడు. దీంతో ఒక్క సినిమాకే వైష్ణవ్ తేజ్ కు క్రేజ్ పెరిగింది. అతడి తర్వాతి సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగింది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు అతని చేతిలో మూడు సినిమాలున్నాయి. ఉప్పెన మూవీ విడుదల కాకముందే స్టార్ డైరెక్టర్ క్రిష్ వైష్ణవ్ తేజ్ ఓ సినిమా మొదలు పెట్టాడు. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది.

తమిళ్ అర్జున్ రెడ్డి దర్శకుడు గిరీషయ్యతో ఓ సినిమా చేసేందుకు కూడా వైష్ణవ్ తేజ్ అంగీకరించాడు. ఇవి కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ లో ఓ సినిమా చేసేందుకు వైష్ణవ్ తేజ్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కు మరో ఆఫర్ వచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ వైష్ణవ్ తో ఓ సినిమా చేయనుంది. నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమాను నిర్మించిన హరీష్ పెద్ది,సాహు గారపాటి ఈ బ్యానర్ ను స్థాపించారు. తమ తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు.

ప్రస్తుతం వారు నాని హీరోగా టక్ జగదీశ్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. టక్ జగదీశ్ విడుదల కాగానే వైష్ణవ్ తేజ్ తో సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ చేతిలో మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ సినిమా పూర్తి కాగా మిగిలిన సినిమాలు వరుసగా షూటింగ్ ప్రారంభం కానున్నాయి.

Also Read

కేజీఎఫ్ రూట్ లోనే సలార్ కూడా…!

లైగర్​ మార్కెట్​ .. ఈ రేంజ్​లోనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -