Friday, April 19, 2024
- Advertisement -

కేజీఎఫ్ రూట్ లోనే సలార్ కూడా…!

- Advertisement -

కన్నడ సినిమాలు ఎప్పుడైనా ఆ రాష్ట్రం దాటి పక్క రాష్ట్రంలో విజయం సాధించింది చాలా తక్కువ. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముందు ఆ సినిమాను తెలుగు,తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తుంటే అంతా ఆశ్చర్యపోయారు. ఒక కన్నడ సినిమాకు అంత బడ్జెట్ ఎందుకు పెట్టారు.. అన్ని భాషల్లో ఎందుకు విడుదల చేస్తున్నారు..అని ఆశ్చర్యపోయారు.

కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత అందరూ షాక్ అయ్యేలా బంపర్ హిట్ అయింది. ఈ భాష ఆ భాష అని తేడా లేకుండా అన్ని చోట్ల సంచలన విజయం సాధించింది. బాహుబలి తర్వాత సౌత్ నుంచి వచ్చిన కేజీఎఫ్ బాలీవుడ్లో కూడా రికార్డులు బద్దలు కొట్టింది. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ గా కేజీఎఫ్-2ను కూడా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఈ మూవీని విడుదల చేయనున్నారు.

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు నేషనల్ స్టార్ ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైనప్పటికీ కోవిడ్ కారణంగా తాత్కాలికంగా షూటింగ్ నిలిపివేశారు. అతి తొందర్లోనే ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే సలార్ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సలార్ సినిమాను ఇప్పుడు రెండు పార్టులుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన ప్రభాస్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై ఇప్పటికే ప్రభాస్, ప్రశాంత్ నీల్ మధ్య చర్చలు జరుగుతున్నాయట.

ప్రభాస్ ఈ సినిమా తో పాటు వరుసగా పాన్ ఇండియా సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆలోచనలో పడినట్లు సమాచారం. ప్రభాస్ ఓకే అంటే సలార్ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇంత వరకు ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొన లేదు. వచ్చే షెడ్యూల్లో శృతి హాసన్ పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాపై ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!

ఏ సినిమా విడుదల ఎప్పుడు? అంతా గందరగోళమే..!

ఆ ఇద్దరు అగ్ర హీరోలూ.. అలా చేయడం ఇదే తొలిసారి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -