Friday, March 29, 2024
- Advertisement -

పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న హరీష్ శంకర్..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వారిద్దరి కాంబినేషన్లో పదేళ్ల కిందట వచ్చిన గబ్బర్ సింగ్ సంచలన విజయం సాధించింది. అది పేరుకు హిందీ దబాంగ్ కు రీమేక్ అయినా కథ మొత్తం పవన్ స్టైల్ కు అనుగుణంగా హరీష్ శంకర్ మార్చాడు. పవన్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు.

హరీష్ శంకర్ చూపిన ఎఫర్ట్ కారణం గా గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పదకొండేళ్ల పాటు పవన్ కు హిట్ లేని కొరత తీర్చింది. మళ్లీ పవన్ హరీష్ కాంబినేషన్లో సినిమా రావాలని పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ల నుంచి కోరుకుంటున్నారు. వారి ఆశలు నెరవేరి వారిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా మొదలవ బోతోంది. పవన్ 28 వ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే హరీష్ స్క్రిప్టు కూడా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ ని ఎంత స్టయిల్ గా అంతే స్టయిల్లో చూపిస్తానని ఇప్పటికే హరీష్ శంకర్ అభిమానులకు హామీ ఇచ్చారు.

తాజాగా హరీష్ ట్విట్టర్లో ‘లెట్స్ విట్నెస్ థిస్ ఎనర్జీ అగైన్’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో బద్రి సినిమాలో పవన్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే ఎనర్జిటిక్ సన్నివేశాలు ఉన్నాయి. హరీష్ శంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు ట్విట్టర్ లో భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోకి ఇప్పటికే సుమారు 6 వేల రీ ట్వీట్లు వచ్చాయి. ఈ వీడియో ఇండియా లెవెల్ లో వైరల్ అవుతోంది. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్నారు. ఇవి పూర్తవగానే హరీష్ శంకర్ సినిమాకు డేట్స్ కేటాయించనున్నాడు.

Also Read

ఆచార్య విడుదలపై అంతా గందరగోళం..!

లైగర్​ మార్కెట్​ .. ఈ రేంజ్​లోనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -