Wednesday, May 1, 2024
- Advertisement -

కరోనా వ్యాక్సిన్​తో వ్యంధ్యత్వం.. నిజమెంత?

- Advertisement -

కరోనా వ్యాక్సిన్​ తీసుకుంటే స్త్రీ, పురుషుల్లో సంతాన ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందని.. పురుషుల వీర్య కణాల మీద వ్యాక్సిన్​ ప్రభావం చూపిస్తుందని ఓ దుష్ర్పచారం సాగుతోంది. దీనికి కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్​ తీసుకోవడం స్త్రీ, పురుషుల సంతాన ఉత్పత్తిపై, పునరుత్పత్తి శక్తిపై ఎటువంటి ప్రభావం చూపదని కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది. అది కేవలం పుకారేనని స్పష్టం చేసింది.

‘ఏ వ్యాక్సిన్​ అయినా అందుబాటులోకి తీసుకొచ్చే ముందే అనేక దశల్లో క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహిస్తారు. ముందు జంతువుల మీద, ఆ తర్వాత మనుషుల మీద అనేక దశల్లో ట్రయల్స్​ నిర్వహించాక.. దానివల్ల ఎటువంటి చెడు ప్రభావం ఉండదని తేల్చిన తర్వాత మాత్రమే అనుమతులు వస్తాయి. కరోనా వ్యాక్సిన్​ తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు. ఇదంతా కేవలం తప్పుడు ప్రచారమే’ అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చేసింది.

పోలియో, మీజిల్స్-రుబెల్లాకు వ్యాక్సిన్​ అందుబాటులో వచ్చిన సమయంలోనూ ఇటువంటి ప్రచారమే సాగింది. కరోనా వ్యాక్సిన్​ అందుబాటులో వచ్చినప్పటి నుంచి అనేక తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. దీంతో సామాన్యులు వ్యాక్సిన్​ తీసుకొనేందుకు భయపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ ప్రచారాలను ఖండించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం .. తమకు కేంద్రం సరిపడినన్ని వ్యాక్సిన్​ డోసులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -