Saturday, April 27, 2024
- Advertisement -

దేశంలో 6 వేల కరోనా కేసులు… కొత్త వేరియంట్ లక్షణాలు..

- Advertisement -

అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో.. ఉన్నట్టుండిగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ‌వ్యాప్తంగా 6050 క‌రోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం ప్రకటింది. వైరస్ వల్ల తాజాగా మరో 14 మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర అప్రమత్తం అయింది.

క‌రోనా కేసుల పెరుగుదలకు కారణం ఒమిక్రాన్​ సబ్​వేరియంట్​ అయిన XBB1.16 వేరియంట్ కారణం అని చెపుతున్నారు. ఢిల్లీ క‌రోనా కేసుల్లో 98 శాతం ఈ వేరియంట్ కేసులే ఉండటం గమనార్హం. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

XBB1.16 వేరియంట్ లక్షణాలు:
మొదట జ్వరం వస్తుంది. ఒకటి, రెండు రోజులు జ్వరం ఉంటుంది. గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, ఒక్కసారిగా అసౌకర్యానికి గురవడం వంటివి ఇందులోని కొన్ని లక్షణాలు. ఈ ఒమిక్రాన్​ ఎక్స్​బీబీ.1.16 వేరియంట్​తో పెద్ద ముప్పేమీ లేదు. కానీ దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు, వయసు పైబడిన వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -